Devara: ఈ రీజన్స్ కోసం దేవరను కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.!

  • September 23, 2024 / 08:25 PM IST

తెలుగులో “కల్కి (Kalki 2898 AD), హనుమాన్ (Hanuman)” తర్వాత పాన్ ఇండియన్ లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న సినిమా ‘దేవర”(Devara). ఎన్టీఆర్  (Jr NTR)  కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Siva)  దర్శకత్వంలో జాన్వీ కపూర్  (Janhvi Kapoor) హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం మీద మంచి అంచనాలున్నాయి. అయితే.. “దేవర”ను ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాక ప్రతీ తెలుగు ప్రేక్షకుడు కచ్చితంగా థియేటర్లలో ఎందుకు చూడాలి అనేందుకు “ఫిల్మీఫోకస్” దగ్గర 7 కారణాలున్నాయి. అవేంటో మీరూ చూడండి!

Devara

1. ఆరేళ్ల తర్వాత విడుదలవుతున్న ఎన్టీఆర్ సినిమా

2018లో విడుదలైన “అరవింద సమేత” (Aravinda Sametha Veera Raghava) తర్వాత “ఆర్ ఆర్ ఆర్” (RRR) వచ్చినప్పటికీ అది మల్టీస్టారర్ సినిమా అయిపోయింది. అయితే.. ఎన్టీఆర్ సోలో సినిమా మాత్రం “దేవర”. అందుకే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. “ఆంధ్రావాలా (Andhrawala), అదుర్స్ (Adhurs), శక్తి (Sakthi), జై లవకుశ (Jai Lava Kusa)” తర్వాత ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా “దేవర” కావడం విశేషం.

2. రత్నవేలు ఎక్స్ లెంట్ ఫ్రేమ్స్ 


“రోబో (Robo), నేనొక్కడినే (1: Nenokkadine), రంగస్థలం” (Rangasthalam) లాంటి సినిమాలు ఆడియన్స్ ను అలరించడంలో రత్నవేలు (R. Rathnavelu) సినిమాటోగ్రఫీ వర్క్ ఏ స్థాయి పాత్ర పోషించింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. “దేవర” సినిమాకి కూడా రత్నవేలు సినిమాటోగ్రఫీ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలవనుంది. ఆల్రెడీ టీజర్, ట్రైలర్స్ లో చూసిన షాట్స్ కి ఫ్యాన్స్ మాత్రమే కాక కమర్షియల్ సినిమా అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. సో, రత్నవేలు మార్క్ ఫ్రేమ్స్ కోసం కచ్చితంగా ఐమాక్స్ స్క్రీన్ లో చూడాల్సిందే.

3. అదిరిపోయిన అనిరుధ్ మ్యూజిక్


“దేవర” కోసం అనిరుధ్ (Anirudh Ravichander) ఇచ్చిన పాటలన్నీ ఆల్రెడీ సూపర్ సక్సెస్ అయిపోయి, ఎక్కడ చూసినా ఆ పాటలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫియర్ & చుట్టమల్లే పాటలకు క్రేజీ ఫ్యాన్స్ బేస్ క్రియేట్ అయ్యింది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో అనిరుధ్ ఎలాగూ అదరగొడతాడు కాబట్టి.. అట్మోస్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో “దేవర” చూస్తే ఆ ఎక్స్ పీరియన్స్ మాములుగా ఉండదు.

4. హాలీవుడ్ రేంజ్ ప్రొడక్షన్ డిజైన్ 


సాధారణంగా మన తెలుగు సినిమాల్లో సెట్స్ అనేసరికి ఖర్చు కోసం వెనుకాడతారు. కానీ.. నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఏమాత్రం వెనుకాడలేదు. పైగా “బాహుబలి” (Baahubali) సినిమాకి వర్క్ చేసిన సాబు సిరిల్ క్వాలిటీ వర్క్ ఏంటో మనకి తెలుసు కాబట్టి, ఆ గ్రాండియర్ ను తప్పకుండా పెద్ద తెర మీద చూడాల్సిందే.

5. సొరచేపతో ఫైట్ మాములుగా ఉండదట


అప్పుడెప్పుడో “ఛత్రపతి”లో (Chatrapathi) ప్రభాస్ (Prabhas) సొరచేపతో తలపడే సీన్ చూసే నోరెళ్లబెట్టేసాం. అలాంటిది “దేవర” సినిమాలో తారక్ సొర చేపతో ఫైట్ చేయడమే కాక, ఆ చేపతో చేసే ఫీట్లు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని భీభత్సంగా ఆకట్టుకుంటుందని వినికిడి. అలాగే.. గ్రాఫిక్స్ విషయంలోనూ దేవర బృందం చాలా జాగ్రత్త తీసుకొని, ముఖ్యంగా ట్రైలర్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను సీరియస్ గా తీసుకొని చాలా ఇంప్రూవ్ చేశారట.

6. ఈసారి కొరటాల మార్క్ మిస్ అవ్వదు

కొరటాల (Koratala Siva) కెరీర్ లో “ఆచార్య” (Acharya) ఒక్కటే ఫ్లాప్, మిగతా సినిమాలన్నీ సూపర్ హిట్లే. ముఖ్యంగా ఆయన సినిమాల్లో ఎమోషన్స్ ను ఇరికించడం, అనవసరమైన పాటలు గట్రా ఉండవు. ‘దేవర”ను ఎంతో జాగ్రత్తగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చెక్కాడు కొరటాల. సో, ఈసారి మాత్రం కొరటాల మార్క్ హిట్ మిస్ అవ్వదు అని సినిమాలోని కొన్ని సీన్స్ చూసిన ఇండస్ట్రీ వర్గాలు బలంగా బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

7. జాన్వీ సొగసు చూడతరమా


శ్రీదేవి (Sridevi)  కుమార్తె జాన్వికపూర్  (Janhvi Kapoor) పరిచయ చిత్రం “దేవర”. ఈ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడి తెలుగు డైలాగ్స్ లిప్ సింక్ ఎక్కడా మిస్ అవ్వకుండా జాగ్రత్తపడిందట. ఆమె పోషించిన తంగం పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని టాక్.

ఆ విషయం తెలుసుకోండంటూ త్రిప్తి ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus