‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) నుండి వస్తున్న చిత్రం ‘దేవర’ (Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన మూవీ ఇది. అలాగే 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన మూవీ కూడా. ఇక ‘దేవర’ లో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి (Sridevi) కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. ఆమెకు టాలీవుడ్ డెబ్యూ మూవీ ఇది. ఇక ఎన్టీఆర్ ను ఢీ కొట్టే విలన్ గా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) నటిస్తున్నాడు.
గ్లింప్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తి కలిగి ఉన్నారు. సెప్టెంబర్ 27న అంటే మరో 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దేవర’ చిత్రం. ఇదిలా ఉండగా.. ఆల్రెడీ ‘దేవర’ చిత్రాన్ని కొంతమంది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించారు. సినిమా వీక్షించిన తర్వాత వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది.
వారి టాక్ ప్రకారం.. ‘దేవర’ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుందట. యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ ను కలిగిస్తాయి అని తెలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ బాగుంటుందట. రివర్స్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుందని అంటున్నారు. అయితే మళ్ళీ క్లైమాక్స్ పుంజుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్స్ సీక్వెన్స్..లు తెలుగు ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ ను కలిగిస్తాయి అని అంటున్నారు.
అనిరుధ్ (Anirudh Ravichander) బీజీయం, ఎన్టీఆర్ నటన, రత్నవేలు (R. Rathnavelu) సినిమాటోగ్రఫీ.. సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అంటున్నారు. మొత్తంగా ‘దేవర’ కంటెంట్ ప్రకారం చూసుకుంటే.. కచ్చితంగా దర్శకుడు కొరటాల శివ గత చిత్రం ‘ఆచార్య’ (Acharya) కంటే బెటర్..గానే ఉంటుందట. ఫ్యాన్స్ ని ఆకట్టుకునే అంశాలు ఉన్నాయని, కామన్ ఆడియన్స్ ని కూడా అవి మెప్పిస్తాయని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు.