Balakrishna: అఖండ దసరాకు రిలీజ్ కావడం సాధ్యమేనా?

  • September 11, 2021 / 08:10 PM IST

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఇతర హీరోలతో పోలిస్తే వేగంగా సినిమాలను పూర్తి చేస్తారు. అయితే అఖండ సినిమా షూటింగ్ మాత్రం అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఈ సినిమా దసరాకు రిలీజవుతుందని వార్తలు వస్తున్నా మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోవడంతో బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరోవైపు ఇతర హీరోల సినిమా రిలీజ్ డేట్స్ కు సంబంధించిన ప్రకటనలు వెలువడుతున్నాయి. అఖండ షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. గోవాలో 13వ తేదీ నుంచి మూడు రోజులు అఖండ షూటింగ్ జరగనుంది.

మరోవైపు సాంగ్స్ షూటింగ్ కూడా బ్యాలెన్స్ ఉందని సమాచారం. గతేడాది బాలకృష్ణ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. బాలయ్య ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో రిజల్ట్ ను అందుకోలేదు. అఖండ మూవీతో బాలయ్య 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బాలయ్య సినీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్య జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. ​ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కాలేదు. మేకర్స్ త్వరలో ఈ సినిమా గురించి పూర్తి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలను మించి ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. దసరాకు అఖండ రిలీజైతే మాత్రం భారీగా కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉంటాయి

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus