Balakrishna: రవితేజ పాట వింటూ బ్రేక్ ఫాస్ట్ చేసిన బాలకృష్ణ.. ఏం జరిగిందంటే?

బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ నెల 19వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఈ సినిమా నుంచి ఒక అప్ డేట్ రానుంది. బాలయ్యకు జోడీగా కాజల్ ఈ సినిమాలో నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తుండటంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించే ఛాన్స్ అయితే ఉంది.

అయితే మాస్ మహారాజ్ ధమాకా సినిమాలోని పాట వింటూ (Balakrishna) బాలయ్య సూర్యాపేటలో బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ధమాకా సినిమాలోని సాంగ్ బ్యాగ్రౌండ్ లో ప్లే అవుతుండగా బాలయ్య ఆ పాటను ఎంజాయ్ చేస్తూ బ్రేక్ ఫాస్ట్ చేయడం గమనార్హం. భగవంత్ కేసరి సినిమా నుంచి త్వరలో సెకండ్ సింగిల్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

భగవంత్ కేసరి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భగవంత్ కేసరి సినిమాకు థమన్ బీజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య రేంజ్ ను భగవంత్ కేసరి మరింత పెంచడంతో పాటు బాలయ్యకు హ్యాట్రిక్ ను అందిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య ఈ సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. భగవంత్ కేసరి సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. బాలయ్యకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య పాన్ ఇండియా హిట్ అందుకుంటారేమో చూడాలి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus