Balakrishna: నందమూరి ఫ్యాన్స్ కు బాలయ్య సర్ప్రైజ్ ఏమిటంటే..?

  • May 26, 2021 / 08:29 PM IST

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ రేపు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు స్మాల్ సర్ప్రైజ్ అంటూ ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్న బాలయ్య సర్ప్రైజ్ అంటూ ప్రకటన చేయడంతో ఆ సర్ప్రైజ్ ఏమిటా..? అని బాలయ్య ఫ్యాన్స్ మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ సర్పైజ్ బాలయ్య సినిమాలకు సంబంధించిన సర్ప్రైజ్ కాదని సమాచారం అందుతోంది.

సీనియర్ ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా బాలకృష్ణ తన గానంతో శ్రీరామదండకం విడుదల చేయనున్నారని రేపు ఉదయం అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. బాలకృష్ణ గానం చేసిన శ్రీరామదండకం ఈ నెల 28వ తేదీన రిలీజ్ కానుంది. సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో చాలా సినిమాల్లో రాముడి గెటప్ లో నటించిన సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ రాముని పాత్రల బొమ్మలకు బాలయ్య గాత్రంతో వీడియో రిలీజ్ కానుందని నందమూరి ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ఈ సర్పైజ్ ఉండబోతుందని తెలుస్తోంది.

అయితే బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి, అఖండ రిలీజ్ డేట్ గురించి, బాలయ్య కొత్త సినిమాల గురించి ప్రకటనలు వెలువడితే బాగుంటుందని భావిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాకపోయినా వచ్చే నెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సర్ప్రైజ్ లను ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతుండటం గమనార్హం.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus