Balakrishna: ఫ్యామిలీతో కలసి థియేటర్లో బింబిసార చూసిన బాలయ్య!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా సోసియో ఫాంటసీ టైం ట్రావెల్ చిత్రం బింబిసారా సినిమా ద్వారా ఆగస్టు 5 తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ సంయుక్త మీనన్ జంటగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో తోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ప్రస్తుతం ఈ సినిమా లాభాల బాటలో దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈ సినిమాని వీక్షించి సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ వంటి హీరోలు ఈ సినిమాలో కురిపించారు.ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ ఈ సినిమాని తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ థియేటర్లో వీక్షించారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఈ సినిమా చూసిన అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా చూసిన అనంతరం బాలయ్య చిత్ర బృందాన్ని అభినందించడమే కాకుండా అద్భుతమైన ప్రయత్నం అంటూ ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణ ఫ్యామిలీతో పాటు హీరో కళ్యాణ్ రామ్,

డైరెక్టర్ వశిష్ట కూడా సినిమాని వీక్షించారు. బాలకృష్ణ ఇలా స్వయంగా థియేటర్ కు వెళ్లి సినిమాని వీక్షించి ప్రశంశలు కురిపించడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని ఓ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా అనంతరం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బిజీ కానున్నారు.అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా అనంతరం బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలతో పాటు త్వరలోనే బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 కార్యక్రమంతో కూడా బిజీ కానున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus