Balakrishna: స్టార్ హీరో బాలకృష్ణకు కోపం వస్తే ఆ విధంగా చేస్తారా.. ఏమైందంటే?

  • August 18, 2023 / 08:35 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ భోళా మనిషి అని ఇండస్ట్రీలో చాలామంది చెబుతారనే సంగతి తెలిసిందే. బాలయ్య ప్రస్తుతం వరుసగా క్రేజీప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ నెల 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరూపం మరోసారి చూడవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా బాలయ్య చాలా సరదాగా ఉంటారు. అయితే బాలయ్యకు కోపం వస్తే ఆ కోపాన్ని వెంటనే ప్రదర్శిస్తారని కూడా ఇండస్ట్రీలో చాలామంది చెబుతారు.

అయితే పిల్లలపై కోపం వస్తే బాలయ్య ఏ విధంగా ఆ కోపాన్ని చూపిస్తారనే ప్రశ్నలకు సంబంధించి తాజాగా సమాధానం దొరికింది. బాలయ్య తన కూతుళ్లు కానీ కొడుకు కానీ ఏదైనా తప్పు చేసినట్టు తన దృష్టికి వస్తే దగ్గరకి పిలిచి చేస్తున్నది తప్పు అని అర్థమయ్యే విధంగా వివరించి చెప్పేవారట. మరోసారి ఆ తప్పును రిపీట్ చేస్తే మాత్రం సున్నితంగా చెబుతారట.

మూడోసారి తప్పు రిపీట్ అయితే మాత్రం బాలయ్య సీరియస్ గా చేసిన తప్పు గురించి చెప్పి మార్చుకోవాలని సూచనలు చేస్తారట. అయితే బాలయ్య కూతుళ్లు, కొడుకు ఒకసారి తప్పు అని చెప్పిన తర్వాత ఆ తప్పులను రిపీట్ చేసేవాళ్లు కాదని తెలుస్తోంది. బాలయ్య మనవళ్ల విషయంలో కూడా ఇదే రూల్ ఫాలో అవుతున్నారని సమాచారం. స్టార్ హీరో బాలకృష్ణ పారితోషికం ప్రస్తుతం 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

బాలయ్య (Balakrishna) బాబీ కాంబో మూవీ షూట్ త్వరలో మొదలుకానుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయని సమాచారం అందుతోంది. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus