Akhanda: ‘అఖండ’.. కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట!

  • May 3, 2021 / 04:15 PM IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. చాలా మంది వైరస్ బారిన పడి మరణిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు విధిస్తున్నారు. సినిమా షూటింగులన్నీ కూడా వాయిదా పడ్డాయి. సీనియర్ హీరోలెవరూ ఇంటి నుండి బయటకి రావడం లేదు. యంగ్ హీరోలు సైతం షూటింగ్ లకు గుడ్ బై చెప్పేశారు. ఒక్క నాని ‘శ్యామ్ సింగరాయ్’ మాత్రమే షూటింగ్ జరుపుకుంటుంది. కొన్ని చిన్నా చితకా సినిమాలు తప్ప ఏవీ కూడా సెట్స్ లో లేవు.

ఇలాంటి సమయంలో నందమూరి బాలకృష్ణ రిస్క్ చేయడానికి సిద్ధమైపోయాడు. బాలయ్య నటిస్తోన్న ‘అఖండ’ సినిమా సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చారు. కరోనా ప్రభావం గట్టిగా ఉంది కాబట్టి ఇప్పట్లో షూటింగ్ జరగదని అనుకున్నారు. కానీ ఈ నెల 12నుండి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ కి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

తక్కువ మంది సిబ్బందితో.. అతడి తక్కువ రోజుల్లో ఈ షెడ్యూల్ ను పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ షెడ్యూల్ లో బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ లు మాత్రమే పాల్గొంటాయట. కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్ లు కావాల్సివుంది. కేవలం నలభై నుండి యాభై మంది క్రూ ఉంటే చాలని.. అందుకే ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. మొన్నటివరకు బాలయ్య ఈ సినిమా సెట్స్ లోనే ఉన్నారు. ఇప్పుడే బ్రేక్ తీసుకున్నారు. అయితే బోయపాటి ఎప్పుడు అడిగితే అప్పుడు కాల్షీట్స్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని సమాచారం.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus