Unstoppable show: ‘అన్ స్టాపబుల్’ క్రేజ్ చూశారా..?

  • February 9, 2022 / 12:33 PM IST

సినిమా సక్సెస్ ను కలెక్షన్స్ ఆధారంగా అంచనా వేస్తారు. అదే ఓటీటీ విషయానికొస్తే.. వ్యూవర్ చూసే నిమిషాల సంఖ్యను బట్టి లెక్కిస్తారు. ఎన్ని వ్యూస్ వస్తే షో అంత పెద్ద సక్సెస్ అయినట్లు లెక్క. నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ కోసం ‘అన్ స్టాపబుల్’ అనే షో చేశారు. ఈ టాక్ షో ఇప్పటికే చాలా రికార్డులు సృష్టించింది. తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది బాలయ్య షో. ప్రసారమైన నిమిషాల పరంగా షో సరికొత్త రికార్డు సృష్టించిందని ఆహా టీమ్ వెల్లడించింది.

Click Here To Watch

ఈ సందర్భంగా టీమ్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్ లో సాటిలేని ఎనర్జీ కోసం ఆపలేని ప్రేమ అంటూ రాసుకొచ్చింది ‘ఆహా’ టీమ్. అలాగే.. ఈ షో ఆహా వీడియోలో 40 కోట్ల నిమిషాలతో అత్యధికంగా వీక్షించబడిన షో గా రికార్డు క్రియేట్ చేసినట్లు తెలిపారు. నిజానికి ఓటీటీలో బాలకృష్ణ ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసి అభిమానులంతా షాకయ్యారు. ఈ షోలో సెలబ్రిటీలను బాలయ్య ఇంటర్వ్యూ చేయడమనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్.

మోహన్ బాబు ముఖ్య అతిథిగా వచ్చిన మొదటి ఎపిసోడ్ నుండి మహేష్ బాబు లాస్ట్ ఎపిసోడ్ వరకు అన్ని ఎపిసోడ్‌లు పెద్ద హిట్ అయ్యాయి. త్వరలో ‘ఆహా’ టీమ్ ఈ టాక్ షో రెండవ సీజన్‌ మొదలుపెట్టాలని చూస్తుంది. ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘అఖండ’ సినిమాతో హిట్టు కొట్టిన ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus