Balayya Babu Remuneration: ‘అఖండ’ తరువాత బాలయ్య రెమ్యునరేషన్!

  • July 18, 2022 / 01:06 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ కొడితే చాలు వెంటనే రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు మన స్టార్స్. మిడ్ రేంజ్ హీరోలు పదికోట్లకు పైగా తీసుకుంటారు. ఇక స్టార్ హీరోలైతే 20 కోట్లకు పైగానే అందుకుంటారు. అయితే టాలీవుడ్ లో రీజనబుల్ రెమ్యునరేషన్ తీసుకునే వారిలో బాలకృష్ణ ముందంజలో ఉంటారు. ‘అఖండ’ సినిమాకి ముందు ఎనిమిది నుంచి పది కోట్లు మాత్రమే తీసుకునే ఆయన.. ‘అఖండ’ హిట్ తరువాత పారితోషికం పెంచేసినట్లు తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న సినిమాకి ముందుగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ అనుకున్నారు. కానీ ఇంకా ఫైనల్ చేయలేదు. సినిమా పూర్తయ్యాక మార్కెట్ చేసే ముందు డిస్కషన్ చేసి సెటిల్ చేసుకుంటారట. అంటే ఎలా లేదన్నా.. రూ.12 కోట్లు బాలయ్యకి రెమ్యునరేషన్ గా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేయబోయే సినిమాకి మరింత ఎక్కువ అమౌంట్ ని కోట్ చేస్తారో లేదో తెలియదు కానీ..

అప్పటికి బాలయ్య రేటు రూ.15 కోట్లు పలుకుతుందని అంటున్నారు. టాలీవుడ్ లో రెమ్యునరేషన్స్ సినిమా సినిమాకి పెరుగుతున్నాయి. యూనిట్ హీరోల నుంచి సీనియర్ హీరోలకు రూ.8 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఇస్తున్నారు. ఆ లెక్కన చూసుకుంటే బాలయ్య రీజనబుల్ గానే ఛార్జ్ చేస్తున్నారనుకోవాలి. కానీ నిజం మాట్లాడుకుంటే..

ఈ మధ్యకాలంలో ‘అఖండ’ తప్ప బాలయ్యకు మరో హిట్టు లేదు. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాతో హిట్ అందుకుంటే మాత్రం ఆయన క్రేజ్ మరింత పెరుగుతుంది. సక్సెస్ ల సంగతి పక్కన పెడితే.. బాలయ్యతో సినిమాలు చేయడానికి మాత్రం దర్శకుడు ఎగబడుతున్నారు. అందులో యంగ్ డైరెక్టర్స్ కూడా ఉండడం విశేషం.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus