యువ హీరోతో పోటీ పడుతున్న సీనియర్ హీరో

  • June 12, 2017 / 06:26 AM IST

ఈ సంవత్సరం మొదట్లోనే సీనియర్ హీరోల మధ్య మంచి వార్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150, నటసింహ బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతికి విడుదలై పండుగ జోష్ ని మరింత పెంచింది. ఇద్దరు సినిమాలు విజయవంతమై టాలీవుడ్ కి ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పుడు అలాంటి యుద్ధం మరొకటి జరగనుంది. అయితే ఈ సారి బాలయ్య యువ హీరోతో తలపడబోతున్నారు. అతను ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు.

బాలకృష్ణ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న పైసా వసూల్ మూవీ 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 29 రావడంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఇక మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న స్పైడర్ మూవీ అనేక వాయిదాల తర్వాత సెప్టెంబర్ కి రావడం ఖాయమని తెలిపింది. పైసావసూల్, స్పైడర్ రెండూ క్రేజీ ప్రాజెక్ట్ లే. మరి వీటిలో దసరా జోష్ పెంచే సినిమా ఏది కాబోతుందో ఇప్పుడో చెప్పలేము.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus