నటసింహా నందమూరి బాలకృష్ణ ఏం చేసినా డిఫరెంట్ గానే ఉంటుంది.. అరవై రెండేళ్ల వయసులోనూ తానింకా కుర్రాడినేనంటూ.. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుంటారాయన. సినిమాలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలు.. ఓటీటీలో అన్ స్టాపబుల్ షో.. ఇలా బీభత్సమైన బిజీ షెడ్యూల్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. ‘అఖండ’తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేస్తున్నారు.
గోపిచంద్ మలినేని దర్శకత్వలంలో, మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రానికి ‘వీర సింహా రెడ్డి – గాడ్ ఆఫ్ మాసెస్‘ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసందే. టైటిల్ లాంఛ్ ఈవెంట్ ని కొండారెడ్డి బురుజు దగ్గర చేయడం అనేది టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం.. సంక్రాంతికి సినిమా రాబోతుందని కన్ఫామ్ చేసేశారు. ఇప్పుడు బాలయ్య మరో సరికొత్త ప్రయోగానికి తెర తియ్యబోతున్నారు. బాలయ్య హోస్ట్ ఏంటి? అని కామెంట్స్ చేసిన వాళ్లకి అన్ స్టాపబుల్ షోతో సాలిడ్ సమాధానం చెప్పాడు.
ఇప్పుడు సెకండ్ సీజన్ లోనూ దుమ్ముదులుపుతున్నాడు. బాలయ్య సరికొత్త ప్రయోగం చేయబోతున్నారనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. కెరీర్ లో మొట్టమొదటి సారిగా ఓ కమర్షియల్ యాడ్ లో నటించబోతున్నాడు నటసింహ.. అదికూడా ఓ రియల్ ఎస్టేట్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ కావడం విశేషం. అన్ స్టాపబుల్ షోకి స్పెషల్ పార్ట్ నర్ గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ సాయిప్రియ కన్ స్ట్రక్షన్స్ కోసం బాలయ్య ప్రమోషన్స్ చెయ్యనున్నాడు.
దీనికి సంబంధించి బాలయ్యకి స్వాగతం పలుకుతూ.. లగ్జీరియస్ కార్ నంబర్ ప్లేట్ మీద NBK1 అని రాసి ఉన్న పిక్ షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు కమర్షియల్స్ కి దూరంగా ఉన్న బాలకృష్ణ.. మారుతున్న కాలంతో పాటు, ప్రేక్షకాభిమానుల అభిరుచుల మేరకు ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తమ హీరో మరో కొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్యడానకి రెడీ అవుతున్నాడంటూ బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు..
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!