బోయపాటి బాలయ్య కాంబినేషన్ సినిమాలో ఆ హాట్ హీరోయిన్

సీనియర్ హీరోస్ కి హీరోయిన్స్ ను ఫైనల్ చేయడం అనేది వాళ్ళ కోసం కథలు సిద్ధం చేయడం కంటే పెద్ద తలపోటుగా మారిపోయింది దర్శకులకు. హీరోయిన్ కి క్రేజ్ ఉండాలి, మార్కెట్ లో స్టార్ డమ్ ఉండాలి, శాటిలైట్ రేట్ పలకాలి, అన్నిటికీ మించి హీరో పక్కన మరీ చిన్న పిల్లలా కనిపించకూడదు. ఇవన్నీ సెట్ అయ్యేలా హీరోయిన్ కుదరడం అనేది కత్తి మీద సామూలా తయారైంది సీనియర్ హీరోల దర్శకనిర్మాతలకు.

అయితే.. బోయపాటి మాత్రం పెద్ద రిస్క్ చేయకుండా పరాయి భాషల్లో ఆల్రెడీ సీనియర్ హీరోలతో నటిస్తున్న కథానాయికలను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు అదే తరహాలో కన్నడలో హాట్ హీరోయిన్ అయిన రచిత రామ్ ను బాలయ్య సరసన ఒన్నాఫ్ ది హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు మరో హీరోయిన్ కోసం సెర్చింగ్ ఇంకా కొనసాగుతుంది. వచ్చే నెల నుండి ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుంది.

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus