Balayya Babu: కొత్తింట్లో అడుగుపెట్టనున్న బాలయ్య.. కారణం అదే..!

  • November 1, 2023 / 05:33 PM IST

నందమూరి బాలకృష్ణ త్వరలో కొత్తింట్లోకి అడుగుపెట్టబోతున్నారు. సాధారణంగా ఆయన ఇల్లు బంజారాహిల్స్- ఫిలింనగర్ పరిధిలోకి వచ్చే ప్లేస్ లో ఉంటుంది. ఆయన ఇంటి ముందు ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల.. అది ల్యాండ్ మార్క్ గా కూడా చాలామంది చెప్పుకుంటారు. కొన్నాళ్ల క్రితం జూబ్లీ హిల్స్ లో ఆయన స్థలం తీసుకుని కొత్తింటి నిర్మాణానికి పూజా కార్యక్రమాలు వంటివి నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఇంట్లోకి ఆయన ఫ్యామిలీ అడుగుపెట్టబోతుందని సమాచారం.

అవును బాలయ్య ఫ్యామిలీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ కి షిఫ్ట్ అవ్వబోతుందట. విచిత్రం ఏంటి అంటే.. బాలయ్య కొత్తిల్లు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అతి సమీపంలో ఉంటుందట. ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్ అనేది జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో గృహప్రవేశ వేడుక నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. బాలయ్య ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ ‘భగవంత్ కేసరి’.. ఇలా ఆయన (Balayya Babu) చేసిన అన్ని సినిమాల హిట్ అయ్యాయి.

అయినప్పటికీ ‘ఎందుకు ఇలా ఇల్లు మారుతున్నారు?’ అనే డిస్కషన్లు సినీ వర్గాల్లో మొదలయ్యాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. బాలయ్య తన ఇంటికి వాస్తు దోషం ఉందని భావిస్తున్నారట. ఆయనకు జాతకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఆయన కుడి చేతికి పచ్చరంగులో ఓ పెద్ద ఉంగరం ఉంటుంది. తమ జ్యోతిష్యులు చెప్పిన మాట మేరకు ఆయన ఆ ఉంగరాన్ని పెట్టుకుంటారు. ఇల్లు మారమనే సలహా కూడా వారే ఇచ్చి ఉండొచ్చు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus