కళ్యాణ్ రామ్ కల నెరవేరుతుందా..?

నందమూరి కళ్యాణ్ రామ్ తన బాబాయ్ నందమూరి బాలకృష్ణతో తన సొంత బ్యానర్ అయిన ‘ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌’ లో ఓ సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడట. తాతయ్య పేరుతో స్థాపించిన ఈ బ్యానర్లో తనకి అత్యంత ఇష్టమైన బాబాయ్‌తో ఓ సినిమా చేయాలని కళ్యాణ్‌రామ్‌ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. తన తమ్ముడు ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనే ఆశ ‘జై లవకుశ’తో తీరింది, కానీ బాలకృష్ణతో తమ కుటుంబానికి విబేధాలు చోటుచేసుకోవడంతో కళ్యాణ్‌రామ్‌ కల నెరవేరలేదు.

కానీ ఇప్పుడు బాలయ్యతో కళ్యాణ్‌రామ్‌ తో బాగానే ఉంటున్నాడు. జూ.ఎన్టీఆర్ అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నా కానీ కళ్యాణ్‌ రామ్‌ మాత్రం బాలయ్యతో కాంటాక్ట్‌లోనే వుంటున్నాడు. ఇప్పటికే ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ లో హరికృష్ణ క్యారెక్టర్‌ని చేసి ఎటువంటి పారితోషికం తీసుకోకుండా చేసిన కళ్యాణ్‌రామ్‌ తన తాజా చిత్రం 118 ప్రీ రిలీజ్‌ వేడుకకి కూడా బాలయ్యని ముఖ్య అతిధిగా ఆహ్వానించాడు. త్వరలోనే బాలకృష్ణతో ‘ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌’ లో ఓ సినిమా చేయాలనీ కళ్యాణ్‌రామ్‌ ప్రయత్నాల్లో వున్నాడని సమాచారం. ఇప్పటికే పలువురు దర్శకులతో బాలయ్యకి సరిపడే కథ కోసం అన్వేషిస్తున్నాడట. మరి కళ్యాణ్ రామ్ కల ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus