నందమూరి బాలకృష్ణ గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌తో దూసుకుపోతున్నారు. ఆయన స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒకేసారి మూడు భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టి, టాలీవుడ్‌లో సరికొత్త వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు బాలయ్య ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయమని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘అఖండ’ సృష్టించిన విధ్వంసం ఇంకా ఎవ్వరూ మర్చిపోకముందే ‘అఖండ 2’తో తాండవం చేయడానికి రెడీ అయ్యారు.
బోయపాటి శ్రీను ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాదే థియేటర్లలోకి దించబోతున్నారు. దసరా బరిలో సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానున్నట్లు అయితే మేకర్స్ ప్రకటించారు.బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ యూట్యూబ్ ను షేక్ చేయడమే కాకుండా సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.
‘వీరసింహారెడ్డి’తో మంచి మాస్ హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు బాలయ్య. ఇది ఆయన కెరీర్లో 111వ చిత్రంగా రానుంది. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 2026 సమ్మర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ‘ఆదిత్య 999 మాక్స్’ పేరుతో మరో చిత్రాన్ని రెడీ చేయనున్నారు బాలయ్య. ‘ఆదిత్య 369’ కి ఇది సీక్వెల్. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. గతంలో వీరి కాంబోలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య ట్రిపుల్ రోల్ పోషిస్తారని టాక్ నడుస్తుంది. అలాగే ఆయన కుమారుడు మోక్షజ్ఞ కూడా ఈ సినిమాలో నటించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సింగీతం శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించనున్నారు.