దసరాకి కాదు ముందుగానే రానున్ను అన్ స్టాపబుల్?

హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా తన స్టైల్ లో అందరిని మెప్పించారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుందని మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం అత్యధిక రేటింగ్ సంపాదించుకొని నెంబర్ వన్ టాక్ షోగా నిలబడింది. ఈ కార్యక్రమం ప్రసారం అవడంతో ఈ టాక్ షోకి రేటింగ్స్ రావడమే కాకుండా ఆహా సబ్స్క్రైబర్లు కూడా అమాంతం పెరిగిపోయారు.

ఇకపోతే మొదటి సీజన్ మంచి విజయం అందుకోవడంతో నిర్వాహకులు రెండవ సీజన్ ఏర్పాటుకు కూడా చేస్తున్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమం దసరా కానుకగా మొదటి ఎపిసోడ్ ప్రసారం కాబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే దసరాకి కాకుండా ఈ కార్యక్రమం ముందుగానే ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 కార్యక్రమాన్ని ఆగస్టు రెండవ వారం నుంచి ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే మొదటి సీజన్లో ఫస్ట్ గెస్ట్ గా మోహన్ బాబు రాగా చివరిగా మహేష్ బాబుతో ముగించారు.

అయితే ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా మెగాస్టార్ రాబోతున్నారని తెలియడంతో ఆ ఎపిసోడ్ కోసం ఇటు నందమూరి అభిమానులు అటు మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus