Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

‘కోర్ట్’ తో హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపళ్ళ జంటకి మంచి క్రేజ్ ఏర్పడింది. వీరి కాంబినేషన్లో రూపొందిన 2వ సినిమా ‘బ్యాండ్ మేళం’. కాంబినేషనల్ క్రేజ్ మాత్రమే కాదు టైటిల్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ‘మ్యాంగో మాస్ మీడియా’ సమర్పణలో ‘కోన ఫిల్మ్ కార్పొరేషన్’ సంస్థపై కావ్య, శ్రావ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సతీష్ జవ్వాజీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సాయి కుమార్ వంటి సీనియర్ నటులు కూడా ఇందులో యాక్ట్ చేశారు.

Band Melam

మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘బ్యాండ్ మేళం’. ఈరోజు టీజర్ ని వదిలారు. శ్రీదేవి చూడటానికి లావణ్య త్రిపాటిలా ఉంటుందని చాలా మంది అంటుంటారు. అందుకే అనుకుంట.. టీజర్ స్టార్టింగ్లో ‘అందాల రాక్షసి’ లో లావణ్య త్రిపాటి పలికిన పాపులర్ డైలాగ్ ని కామెడీగా చెప్పించారు. హర్ష్ రోషన్, శ్రీదేవి.. ఇందులో బావా మరదళ్లుగా కనిపించనున్నారు. అలాగే కామిడీ పందించడానికి తెగ కష్టపడ్డారు అని చెప్పాలి.

కానీ టీజర్లో కామెడీ ఎక్కడా పండలేదు. కథలో కాన్ఫ్లిక్త్ పాయింట్ ఏమీ రివీల్ చేయలేదు. రోషన్ ఎక్స్ప్రెషన్స్ ఓవర్ ది టాప్ అన్నట్టు ఉన్నాయి. శ్రీదేవి ఎక్స్ప్రెషన్స్ కూడా అల్మోస్ట్ అంతే. టీజర్ చాలా అంటే చాలా సిల్లీగా ఉంది. 1:45 నిమిషాల టీజర్ లో ఒక్క హై ఇచ్చిన పాయింట్ కూడా లేకపోవడం బాధాకరం. కేవలం హర్ష్ రోషన్, శ్రీదేవి పెయిర్ కి ఉన్న క్రేజ్ తో ఓటీటీకి అమ్ముడుపోయేట్టు ఈ ‘బ్యాండ్ మేళం’ని చుట్టేసినట్టు ఉన్నారు.మీరు కూడా ఒకసారి చూడండి :

నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus