Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

‘వారణాసి’ సినిమా తర్వాత మహేష్‌ బాబు చేయబోయే సినిమా ఇదే అంటూ గత కొన్ని నెలలుగా ఓ వార్త తెలుగు సినిమా మీడియాలో, సోషల్‌ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అదే సందీప్‌ రెడ్డి వంగాతో చేయబోయే సినిమా ఇది. ఎవరూ ఈ రూమర్లకు కొట్టిపారేయడం లేదు. అలా అని క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. అయితే, ఇప్పుడు వీటి గురించి దర్శకుడు ఇన్‌డైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చారా.. అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇదంతా మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా జరిగింది.

Mahesh – Sandeep

ఈ నెల 9న మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా సందీప్‌ రెడ్డి వంగా విష్‌ చేశారు. మామూలుగా ‘హ్యాపీ బర్త్‌డే బాబూ’ అని రాసి ఉంటే ఈ డౌట్‌ వచ్చేది కాదు. కానీ ఆయన ప్రత్యేకంగా ఏఐ వీడియో చేయించి మరీ BOB కళ్లల్లో ఆనందం చూశారు. నిజానికి ఆ వీడియో చాలా బాగా కుదిరింది కూడా. దివంగత సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన ‘కిరాయి కోటిగాడు’ సినిమాలోని ఓ హిట్‌ ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్‌ని అందులో మహేష్‌తో చెప్పించారు.

అదే ‘ఊరు తెనాలి.. ఉద్యోగం కిరాయి ఉంచుకుని కాళ్లు, చేతులు విరగొట్టం.. వివరాలు చాలుగా’ అనే డైలాగ్‌. ఈ డైలాగ్‌ ఎలాంటి మజా ఇస్తుందో మహేష్‌ – కృష్ణ ఫ్యాన్స్‌కి బాగా తెలుసు. ఇంతటి బెస్ట్‌ డైలాగ్‌తో విషెస్‌ చెప్పారు అంటే.. తర్వాత తాము చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశారు అని అనిపిస్తోంది. గతంలో ఈ కాంబో గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ‘డెవిల్‌’ అనే ప్రాజెక్ట్‌ పేరు వినిపించింది. మరిప్పుడు ఆ సినిమాలో మహేష్‌ పాత్ర ఇలానే మాసీగా ఉండబోతోంది అని సందీప్‌ చెప్పకనే చెప్పారా అనిపిస్తోంది.

ప్రస్తుతం సందీప్‌ ‘స్పిరిట్‌’ సినిమాతో బిజీగా ఉండగా.. మహేష్‌ ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండూ అయ్యాకనే ‘డెవిల్‌’ సంగతి తేలుతుంది. చూద్దాం ఊర మాసీ క్లాసీ సినిమా ఎప్పుడో?

‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus