Bandla Ganesh, Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు బండ్లన్న కానుక ఇదే!
- August 28, 2021 / 09:17 AM ISTByFilmy Focus
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ పుట్టినరోజు కావడంతో ఆరోజు కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఈ మధ్య కాలంలో తన కామెంట్ల ద్వారా బండ్ల గణేష్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాల్లో గబ్బర్ సింగ్ సినిమా ప్రత్యేకమనే సంగతి తెలిసింది.
ఖుషీ సినిమాకు గబ్బర్ సింగ్ మూవీకి మధ్యలో పవన్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. గబ్బర్ సింగ్ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించగా హరీష్ శంకర్ దర్శకునిగా పని చేశారు. హరీష్ శంకర్ పవన్ అభిమాని కావడంతో ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలని అనుకుంటారో పవన్ ను అదే విధంగా చూపించారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గబ్బర్ సింగ్ సినిమాను ప్రదర్శిస్తామని బండ్ల గణేష్ అన్నారు.

దయచేసి మీరందరూ థియేటర్ బుక్ చేసుకోవాలని బండ్ల గణేష్ ఫ్యాన్స్ కు సూచించారు. షోకు తాను అనుమతి ఇస్తానని బండ్ల గణేష్ వెల్లడించారు. పవన్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ పవన్ పై అభిమానం చాటుకోవడానికి వచ్చిన ప్రతి సందర్భంను సద్వినియోగం చేసుకుంటూ ఉండటం గమనార్హం. బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ ప్రదర్శనకు అనుమతులు ఇవ్వడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

















