Bandla Ganesh: బన్నీపై బండ్లన్న కామెంట్స్‌.. ఏమన్నాడంటే?

  • December 5, 2022 / 11:29 AM IST

బండ్ల గణేష్ అంటే ఒకప్పుడు మంచి కమెడియన్‌, ఆ తర్వాత బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌.. ఇప్పుడు కాంట్రవర్శీ కింగ్‌. ఈ మాట మేం అనడం కాదు. ఆయనే తరచుగా ఏదో ఒకటి మాట్లాడుతూ, వార్తల్లో నిలుస్తూ.. తద్వారా కాంట్రవర్శీ కింగ్‌ అనిపించుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి ఆయన ఇలాంటి మాటలే అని, ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాడు. అల్లు బ్రదర్స్‌ గురించి బండ్ల గణేష్‌ కొన్ని కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.

బండ్ల గణేశ్‌ ముక్కుసూటిగా మాట్లాడతారు అని టాక్‌. ఏ విషయమైనా ఫిల్టర్లు లేకుండా మాట్లాడేస్తుంటారు. దీంతో అవి కాంట్రవర్శీ అవుతుంటాయి. అయితే కొన్నిసార్లు నోరు జారడం ఆయనకు పరిపాటి. ఆయన ఎందుకో మొదలుపెడితే, అది ఎందుకో ముగిసిపోయినట్లు ఉంటుంది. అలా ఈ మధ్య ఓ పార్టీకో, ఫంక్షన్‌లో అల్లు బాబీ, బండ్ల గణేష్‌ కలిశారు. ఈ సందర్భంగా బాబీతో ఓ పోజు ఇస్తూ.. తండ్రి మాట వింటే ఇలా, తండ్రి మాట వినకపోతే ఇంకోలా కామెంట్స్‌ చేశారు.

‘‘తండ్రి మాట వింటే బాబీలా అవుతారు. తండ్రి మాట వినకపోతే మా హీరో బన్నీలా అవుతారు’’ అంటూ బండ్లన్న కామెంట్స్‌ చేశాడు. ఈ మొత్తం కామెంట్స్‌ను ఓ వ్యక్తి తన ఫోన్‌లో రికార్డు చేశారు. ఆ రికార్డింగ్‌ను బాబీ దగ్గరుండి పర్యవేక్షించారు కూడా. అయితే ఈ మొత్తం సీన్‌ను మరో వ్యక్తి వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బండ్లన్న ఏ ఉద్దేశంలో అన్నారో తెలియదు కానీ.. బన్నీ ఫ్యాన్స్‌ మాత్రం ఇంకోలా తీసుకుంటున్నారు.

అల్లు అర్జున్‌ తన తండ్రి మాటలు వినరా? అంటూ బండ్ల గణేశ్‌ మీద సర్రున లేస్తున్నారు. అన్నదమ్ములను పోల్చుతూ ఒకరిని పొగుడుతూ, మరొకరిని తక్కువ చేస్తూ మాట్లాడడం ఏంటి? ఇది పద్ధతి కాదు అంటూ బండ్ల గణేష్‌పై ట్రోలింగ్‌కి దిగుతున్నారు. మరి దీనిపై బండ్ల గణేష్‌ ఏం స్పందిస్తారో చూడాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus