ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడు ఎలా ఉంటారో అంచనా వేయలేం. కమెడియన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి సడెన్ గా స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి బడా హీరోలతో సినిమాలు తీశాడు. ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి.. అక్కడ సెన్సేషనల్ కామెంట్స్ చేసి.. తిరిగి సినిమాల్లోకి వచ్చాడు. ఇక ప్రొడ్యూసర్ కమ్ నటుడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే.
ట్విట్టర్ లో ఆయన చేసే రచ్చ మాములుగా ఉండదు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సామజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో పలు పోస్ట్ లు పెడుతూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంటారు. చాలా సార్లు ఆయన చేసి ట్వీట్లు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సడెన్ గా ఆయన ట్విట్టర్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. ‘త్వరలోనే ట్విటర్ గుడ్ బై చెప్పేస్తా.
నాకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. నా జీవితంలో వివాదాలకు తావివ్వకుండా జీవించాలని అనుకుంటున్నా’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆయన ఫాలోవర్స్ షాక్ కు గురయ్యారు. ఎందుకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి బండ్ల ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందో..!
త్వరలో కి ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పేస్తా No controversies. I don’t want any controversies in my life 🙏