‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలయ్యింది.కాస్త రొటీన్ గా అనిపించినా మొత్తానికి బాగానే ఉంది అనే టాక్ ను ఈ సినిమా సంపాదించుకుంది.
కలెక్షన్ల పరంగా మొదటి రోజు భారీగా రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా మొదటి రోజుతో సమానంగా రాబట్టింది. రెండు రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం | 4.45 cr |
సీడెడ్ | 3.35 cr |
ఉత్తరాంధ్ర | 1.95 cr |
ఈస్ట్ | 1.89 cr |
వెస్ట్ | 1.40 cr |
గుంటూరు | 1.80 cr |
కృష్ణా | 0.96 cr |
నెల్లూరు | 0.85 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 16.65 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.50 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 18.15 cr |
‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.18.15 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.20.85 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. చిన్న సినిమాలు పెద్దగా ఈ చిత్రానికి పోటీని ఇవ్వలేకపొతున్నాయి. కాబట్టి ఈ సంక్రాంతి విన్నర్ బంగార్రాజే . జనవరి 17 వరకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!