Bangarraju Collections: 8వ రోజున ‘బంగార్రాజు’ బాగానే రాబట్టాడు కానీ..!

  • January 22, 2022 / 12:38 PM IST

‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు’ విడుదలయ్యింది.కాస్త రొటీన్ గా అనిపించినా మొత్తానికి బాగానే ఉంది అనే టాక్ ను ఈ చిత్రం రాబట్టుకుంది.

మొదటి వారం ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది.టికెట్ రేట్లు తక్కువగా ఉన్న ఆంధ్ర వంటి ఏరియాల్లో కూడా ఈ చిత్రం సాలిడ్ గా రాబట్టింది. అయితే నైజాంలో మాత్రం ఈ చిత్రం ఆశించిన మేర కలెక్ట్ చేయలేకపోతోంది. ఒకసారి 8 రోజుల కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 7.72 cr
సీడెడ్ 6.76 cr
ఉత్తరాంధ్ర 4.36 cr
ఈస్ట్ 3.62 cr
వెస్ట్ 2.60 cr
గుంటూరు 3.06 cr
కృష్ణా 1.98 cr
నెల్లూరు 1.69 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 31.79 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 3.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 34.79 cr

 

‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.34.79 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.4.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నిన్న రెండో శుక్రవారం నాడు కూడా ఈ చిత్రం 0.47 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది.

చెప్పాలంటే ఇవి మంచి కలెక్షన్లే..! కాకపోతే ఇలా పెర్ఫార్మ్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం. గత 3 రోజులుగా అయితే ఈ చిత్రం నైజాం పెర్ఫార్మన్స్ చాలా ఘోరంగా ఉంది. కోవిడ్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా అనుకుంట ‘బంగార్రాజు’ … ‘సోగ్గాడే చిన్నినాయన’ రేంజ్ లో కలెక్ట్ చేయలేకపోతోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus