కళ్యాణ్ జ్యూవెలర్స్ కొత్త యాడ్ పై కన్నెర్రజేసిన బ్యాంకర్స్!

ఒక్కోసారి మనం చేసే పనుల వల్ల మనకి తెలియకుండానే అవతలి వ్యక్తుల మనసుల్ని గాయపరుస్తాయి. ఇప్పుడు కళ్యాణ్ జ్యూవెలర్స్ కొత్త యాడ్ పరిస్థితి అలానే తయారయ్యింది. ఇటీవల కళ్యాణ్ జ్యూవెలర్స్ సంస్థ తమ బ్రాండ్ అంబాసిడర్ అయిన అక్కినేని నాగార్జునతో ఒక యాడ్ ను షూట్ చేశారు. తమ సంస్థ నిజాయితీకి నిదర్శనమని తెలియజెప్పేలా ఒక యాడ్ ను షూట్ చేశారు. ఆ యాడ్ లో నాగార్జునకు పెన్షన్ రెండుసార్లు పడగా.. అది బ్యాంక్ మేనేజర్ కి చెప్తాడు, దానికి బదులుగా బ్యాంక్ మేనేజర్ “ఏం పర్లేదు ఉంచుకోండి, ఎవడు పట్టించుకొంటాడు” అని సమాధానమిస్తాడు. ఈ సమాధానం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

మేమేమీ అంత కేర్ లెస్ గా ఉండము, అలా ఎలా ప్రొజెక్ట్ చేస్తారు అంటూ కళ్యాణ్ జ్యూవెలర్స్ యాజమాన్యంపై బ్యాంకర్స్ అందరూ కన్నెర్ర జేశారు. దాంతో.. ఎందుకొచ్చిన గొడవ అనుకొన్న కళ్యాణ్ సంస్థ ఆ యాడ్ ను వెనక్కి తీసుకొంటున్నామని ప్రకటించారు. పాపం ఈ గొడవ మొత్తానికి నాగార్జునకి ఏమాత్రం సంబంధం లేకపోయినా.. ఆ యాడ్ లో నటించాడన్న ఏకైక కారణం చేత ఆయన పేరు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus