‘బలగం’ మూవీతో తెలుగు రాష్ట్రాల సినీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దర్శకుడు వేణు యెల్దండి. చిన్న చిన్న సినిమా క్యారెక్టర్లు చేసుకుంటూ, తెలుగు లో సూపర్ హిట్ అయిన రియాలిటీ షో జబర్దస్త్ కామెడీ షో లో టీం లీడ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. అయితే ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని బలమైన గ్రామీణ భావోద్వేగాలతో కూడిన కథతో మెగా ఫోన్ చేతబట్టి, తీసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో తాను రూపొందించబోయే తదుపరి ప్రాజెక్టు ‘ఎల్లమ్మ’ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీకి సంబందించి విలన్ రోల్ లో ఒక సీనియర్ హీరో ను సంప్రదించగా, ఆయన ఓకే చెప్పినట్లు ఒక వార్త ఆన్లైన్ లో సందడి చేస్తుంది.
అదేంటంటే.. ఒకప్పటి తెలుగు హీరో వడ్డే నవీన్ చాలా ఏళ్ళ సుదీర్ఘమైన గ్యాప్ తరువాత మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుండగా, డైరెక్టర్ వేణు ‘ఎల్లమ్మ’ కథతో ఆయన్ని సంప్రదించినట్టు, ఆ కథకు ఇంప్రెస్ అయిన వడ్డే నవీన్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే.. హీరో పాత్రలో దేవి శ్రీ ప్రసాద్ నటిస్తుండగా, విలన్ పాత్రలో వడ్డే నవీన్ నటించబోతున్నాడట. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి మూవీ యూనిట్ అఫీసియల్ గా ప్రకటన చేయబోతుందట.
ఇది ఇలా ఉండగా, ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ యే స్వయంగా మ్యూజిక్ అందిస్తుండగా, దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతుంది.