Bappi Lahiri: ఈ 10 తెలుగు సినిమాలకు బప్పీ లహరి సంగీతం అందించాడని మీకు తెలుసా?

  • February 16, 2022 / 07:35 PM IST

1980-90 లలో బప్పీ లహరి మ్యూజిక్ అంటే ఓ సెన్సేషన్. మిథున్ చక్రవర్తి డిస్కో డ్యాన్సర్ మూవీకి బప్పీ లహరి అందించిన మ్యూజిక్ అప్పట్లో ఓ సెన్సేషన్. అందులో వచ్చే రిట్రో సాంగ్స్ అప్పటి యువతని ఓ ఊపు ఊపేసాయి. ‘ఐ యాం ఎ డిస్కో డ్యాన్సర్’ అనే పాట ఇప్పటి జనరేషన్ కు కూడా బాగా తెలుసు. కానీ దానికి స్వరకర్త బప్పీ లహరి అని ఎక్కువ మందికి తెలిసుండదు. ఒక్క బాలీవుడ్లోనే కాదు మరాఠి, బెంగాలీ, తెలుగు సినిమాలకి కూడా పని చేసి సూపర్ హిట్ మ్యూజిక్ ను అందించారు బప్పీ లహరి. ఇదిలా ఉండగా… మంగళవారం అర్ధరాత్రి బప్పీ లహరి మరణించడం ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొట్టింది. 70 ఏళ్ల ఈ సంగీత దర్శకుడు ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. తెలుగులో బప్పీ లహరి సంగీతం అందించిన కొన్ని తెలుగు సినిమాలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) సింహాసనం :

కృష్ణ, జయప్రద కాంబినేషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీకి బప్పీ లహరి సంగీతం అందించారు. ‘ఆకాశంలో ఒక తార’ అనే పాట ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచింది.

2) స్టేట్ రౌడీ :

చిరంజీవి- బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి కూడా బప్పీ లహరి సంగీతం అందించారు. ‘రాధ రాధ మదిలోన’ అనే పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది.

3) రౌడీ అల్లుడు :

ఈ సినిమాకి కూడా మన బప్పీ లహరి నే సంగీత దర్శకుడు. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే..!

4) గ్యాంగ్ లీడర్ :

బప్పీ లహరి సంగీతంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

5) రౌడీ ఇన్స్పెక్టర్ :

బాలయ్య హీరోగా నటించిన ఈ చిత్రానికి కూడా బప్పీ లహరి సంగీతం అందించాడు. ‘డిక్కీ డిక్కీ’ ‘అరె ఓ సాంబ’ అనే పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

6) నిప్పు రవ్వ :

బప్పీ లహరి సంగీతంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్లే..!

7) పుణ్య భూమి నాదేశం :

మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి బప్పీ లహరి సంగీత దర్శకుడు. ఈ చిత్రంలోని పాటలన్నీ మంచి హిట్ అయ్యాయి. కోదండ రామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.

8) బిగ్ బాస్ :

సినిమా ప్లాప్ అయ్యింది. కానీ బప్పీ లహరి సంగీతంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్టే..!

9) రౌడీ గారి పెళ్ళాం :

మోహన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రానికి బప్పీ లహరి సంగీత దర్శకుడు. ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

10) బ్రహ్మ :

మోహన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రానికి కూడా బప్పీ లహరి సంగీతం అందించారు. ఇందులోని పాటలు కూడా చాలా బాగుంటాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus