పెళ్ళికొడుకు కాబోతున్న బెల్లంకొండ..!

‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి చిత్రంతోనే హిట్టందుకున్న బెల్లంకొండ ఆ తరువాత హిట్టందుకోవడానికి ఏకంగా 5 ఏళ్ళు పట్టింది. ఇటీవల రమేష్ వర్మ డైరెక్షన్లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన ‘రాక్షసుడు’ చిత్రం డీసెంట్ హిట్ గా నిలిచింది. గతేడాది కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచినా ‘రాట్ససన్’ చిత్రానికి ఇది రీమేక్. మొదటి వారం వసూళ్ళు యావరేజ్ గా ఉన్నప్పటికీ రెండో వారం కూడా స్టడీ గా ఉండడం విశేషం. ఇక త్వరలోనే బాలీవుడ్ కి కూడా బెల్లంకొండ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక ఇదే ఆనందంలో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్… తన కొడుకు పెళ్ళి చేసుకోబోతున్నాడన్న విషయాన్నీ కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇటీవల నిర్వహించిన ‘రాక్షసుడు’ ప్రెస్ మీట్ లో ‘త్వరలోనే తమ కుటుంబంలోని అమ్మాయినే చూసి సాయి శ్రీనివాస్ కి వివాహం చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు సురేష్. అంటే వచ్చే ఏడాది బెల్లకొండ వారి ఇంట్లో పెళ్ళి భాజాలు మోగడం ఖాయమన్న మాట. ఇక అతిత్వరలోనే బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా ఓ స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఉండబోతుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus