Bellamkonda Sreenivas: రష్మిక తో డేటింగ్ వార్తల పై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ!

  • May 3, 2023 / 06:16 PM IST

రష్మిక మందన.. బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అందుకే ఈమెను నేషనల్ క్రష్ అంటున్నారు. క్రేజ్ పెరిగేకొద్దీ .. గాసిప్స్ కూడా పెరుగుతాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా బాలీవుడ్ లో అయితే ఇంకా ఎక్కువ. రష్మిక పై కూడా తరచూ రూమర్స్ వస్తుంటాయి. విజయ్ దేవరకొండతో ఈమె డేటింగ్ లో ఉంది, త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మనకంటే ఎక్కువగా బాలీవుడ్ మీడియానే కోడై కూసింది.

అక్కడి స్టార్లు కూడా విజయ్ – రష్మిక ల గురించి చాలా సార్లు అనుమానాలు రేపే విధంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. లైగర్ షూటింగ్ నిమిత్తం విజయ్ దేవరకొండ, మిషన్ మజ్ను షూటింగ్ నిమిత్తం రష్మిక… ముంబైలో ఉన్నప్పుడు తరచూ కలుసుకునేవారు. అందుకే వీరి పై ఎక్కువగా వార్తలు వచ్చేవి. అయితే వాటికి డైవర్షన్ గానో ఏమో కానీ… ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో రష్మిక డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో రష్మిక – శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) .. రెండు మూడు సందర్భాల్లో కలిసి కనిపించారు. అంతే ఈ వార్తలు షురూ అయ్యాయి. తాజాగా ఈ వార్తల పై బెల్లంకొండ శ్రీనివాస్ స్పందించాడు. ‘ ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో.. అర్థం కావడం లేదు. నేను రష్మికతో కలిసి రెండు సార్లు ఎయిర్పోర్ట్ లో కనిపించాను. అంతే ఇలాంటి గాసిప్స్ పుట్టించారు.

అంతే మా మధ్య ఏమీ లేదు.’ అంటూ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇతను కూడా తరచూ ముంబై వెళ్ళి వస్తున్నాడు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus