రూ.50 కోట్ల క్లబ్ గ్యారెంటీ!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్ లో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా కూడా ఉంది. ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రానప్పటికీ చిత్రబృందం సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ వేడుకలో ‘అల్లుడు అదుర్స్’ సినిమా లెక్కలు బయటపెట్టారు నిర్మాత బెల్లకొండ సురేష్. నిజానికి ఈ సినిమా జనవరి 15న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఒకరోజు ముందుగా సినిమాను రిలీజ్ చేశారు.

ఈ సినిమా కలెక్షన్స్ గురించి బెల్లంకొండ సురేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందించిన సినిమాల్లో ఒకటిగా ‘అల్లుడు అదుర్స్’ సినిమా నిలిచిందని.. ఈ సినిమా తొలిరోజే మూడు కోట్ల షేర్ రాబట్టింది బెల్లంకొండ సురేష్ అన్నారు. కేవలం మూడు రోజుల్లోనే రూ.10 కోట్ల షేర్ ని రాబట్టి సక్సెస్ బాటలో వెళ్తోందని అన్నారు. హీరో రెమ్యునరేషన్ కాకుండా.. సినిమా నిర్మాణం కోసం రూ.32 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారా రూ.21 కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పిన బెల్లంకొండ సురేష్ మరో 11 లక్షలు వసూలు చేస్తే సినిమా సేఫ్ అయినట్లేనని అన్నారు. ఇప్పటికే తొలి మూడు రోజుల్లో రూ.10 కోట్లు వచ్చాయి కాబట్టి ఇంకొంత వసూళ్లు రాబడితే ఆపై నిర్మాతకు వచ్చేవి అన్నీ లాభాలేనని అన్నారు. అందరికీ కావాల్సింది డబ్బేనని.. ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్ లో చేరడం గ్యారంటీ అని అన్నారు.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus