Pathaan: ‘పఠాన్’ బికినీ సాంగ్ తొలగింపు వెనుక ఇంత జరిగిందా..?

  • January 31, 2023 / 08:23 PM IST

కొన్ని సినిమాలు అంతంత మాత్రంగానే ఉన్నా.. పాస్ మార్కులు వేయించేసుకుంటాయి. అందుకు ప్రధాన కారణం ఆ సినిమా రిలీజ్ కు ముందు ఏర్పరుచుకున్న హైప్. అది ఏ రకంగానైనా కావచ్చు. ఇప్పుడు మనం ‘పఠాన్’ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ మాట చెప్పగానే చాలా మందికి బికినీ సాంగ్ స్ట్రైక్ అవుతుంది. ఎందుకంటే సినిమా రిలీజ్ కు ముందు బేషర‌మ్ పాట క్రియేట్ చేసే ఇంపాక్ట్ అలాంటిది.ఈ ఒక్క పాట వల్ల చాలా వివాదాలు చోటుచేసుకున్నాయి.

హీరోయిన్ దీపికా పదుకొనే కాషాయం రంగు బికినీ ధరించడం పై హిందూ సంఘాలు, బిజెపి, విహెచ్ పి, శివ‌సేన వంటివి తీవ్ర స్థాయిలో మండిపడుతూ నిరసనకు దిగారు. ఆ పాటలో దీపిక ప్రైవేటు పార్ట్ ల‌పై షారుఖ్ చేతులు వేస్తున్నట్టు కూడా ఉండటం వారిని మరింత రెచ్చగొట్టినట్టు అయ్యింది. ఒక స్టార్ హీరోయిన్ పైగా పెళ్లయిన ఆమె ఇలా బికినీ వేసుకోవడం ఏమిటని సామాన్యులు కూడా దీపికా పై మండిపడ్డారు.

ఇవన్నీ ఎలా ఉన్నా… ఆ పాట ‘పఠాన్’ సినిమాపై హైప్ పెరగడానికి కారణం అయ్యింది అనేది వాస్తవం. కానీ ‘పఠాన్’ ను ఆ పాట కోసం చూడటానికి వెళ్లిన వాళ్లకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది అనే కామెంట్లు గత 6 రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ పాటకు చాలా సెన్సార్ కట్ లు పడ్డాయి. చాలా విజువల్స్ ను కోసేశారు. పైగా దీపిక పై చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలను చాలా మట్టుకు తొలగించినట్టు ఇన్సైడ్ టాక్.

ఏదేమైనా ‘పఠాన్’ బాక్సాఫీస్ వద్ద పాస్ మార్కులు వేయించుకోవడానికి ఈ పాట చాలా సాయం చేసింది అనేది మాత్రం అక్షర సత్యం. అయితే థియేటర్లో కట్ చేసిన విజువల్స్ ను ఓటీటీ రిలీజ్ చేసేప్పుడు జత చేస్తారు అని ఇన్సైడ్ టాక్. చూడాలి మరి అందులో ఎంతవరకు నిజముందో..! ఇక ‘పఠాన్’ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus