Bhagavanth Kesari: భగవంత్ కేసరి మూవీ ఫస్ట్ రివ్యూ’ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి మూవీ థియేటర్లలో విడుదల కావడానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే విషయం తెలుసుకోవడానికి ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ సొంతం చేసుకోవడంతో పాటు ఓవర్సీస్ లో మూడోసారి హ్యాట్రిక్ ను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తుండటం గమనార్హం.

బాలయ్య మరో గెటప్ లో కనిపించే సీన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని ఇంటర్వెల్ ట్విస్ట్ కు గూస్ బంప్స్ రావడం ఖాయమని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ సొంతం చేసుకోవడంలో ఏ మాత్రం సందేహం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య కనిపించే ప్రతి సీన్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా ఉండనుందని భోగట్టా. థమన్ బీజీఎంతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

థమన్ ఈ సినిమాతో తన రేంజ్ ను పెంచుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రీలీల కెరీర్ లో ఈ సినిమా మెమరబుల్ మూవీగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భగవంత్ కేసరి అనిల్ రావిపూడి కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. భగవంత్ కేసరి భాషతో సంబంధం లేకుండా రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ కు విందు భోజనంలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. భగవంత్ కేసరి 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus