సీనియర్ స్టార్ హీరోయిన్ టబు(Tabu) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీలో చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో ‘కూలీ నెంబర్ 1’ ‘నిన్నే పెళ్ళాడతా’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. హిందీలో అయితే క్రేజీ వెబ్ కంటెంట్ కి ఈమె ఫస్ట్ ఛాయిస్ అయిపోయింది.
ఓ పక్క ప్రాముఖ్యత కలిగిన పాత్రలు పోషిస్తునే మరోపక్క ఇప్పటికీ గ్లామర్ సీన్స్ లో కూడా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ఈమె మీడియాతో మాట్లాడుతూ పెళ్లి గురించి చేసిన స్టేట్మెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.టబు ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘పడుకోవడానికి మగాడు ఉంటే సరిపోతుంది.దాని కోసం పెళ్ళెందుకు? నేను నా సింగిల్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. పెళ్ళి చేసుకునే ఉద్దేశం అయితే నాకు లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.
టబు వయసు 54 ఏళ్ళు. ఇప్పటికీ ఆమె పెళ్ళి చేసుకోలేదు. ఇప్పటికే చాలా సార్లు ఆమె పెళ్లి విషయం పై స్పందించింది. ఒకసారి నచ్చిన వ్యక్తి దొరకలేదని… ఇంకోసారి తన వర్కింగ్ లైఫ్ తో పెళ్లయిందని.. కాబట్టి పెళ్లి చేసుకోలేదు అనే విషయం ఎప్పుడూ లోటుగా అనిపించలేదని.. మరోసారి పెళ్లి సంగతి ఎలా ఉన్నా.. ఒక బేబీని అడాప్ట్ చేసుకుని మదర్ అవ్వాలని ఉందని.. అటు తర్వాత అయితే తాను సింగిల్ గా ఉండిపోవడానికి స్టార్ హీరో అజయ్ దేవగన్ అలాగే తన అన్న కారణమని.. ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చింది.
ఇప్పుడైతే ఏకంగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. కేవలం పడక సుఖం కోసమే జనాలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అనేది ఆమె ఉద్దేశం కావచ్చు.