భరత్ అనే నేనులో పలు సామాజిక సమస్యలపై వార్.!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటిస్తున్న మూవీ డబ్బింగ్ దశలో ఉంది. డబ్బింగ్ పూర్తి చేసిన తర్వాత చిత్ర యూనిట్ స్పెయిన్ వెళ్లనుంది. అక్కడ మిగిలి ఉన్న ఒక పాట ను షూట్ చేయనున్నారు. దీంతో షూటింగ్ కంప్లీట్ అయినట్లే. దాని తర్వాత ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. హ్యాట్రిక్ హిట్ తర్వాత కొరటాల శివ చేస్తున్న ఈ సినిమాలో పలు సామాజిక సమస్యలపై హీరో పోరాడుతారని తెలిసింది. గత చిత్రాల్లో ఫ్యాక్షన్, పొల్యూషన్, డెవలప్ మెంట్ వంటి అంశాలపై ఫోకస్ పెట్టిన కొరటాల ఇందులో విద్యావ్యవస్థ, వైద్య రంగం, పేదరికం, నిరుద్యోగం, ప్రభుత్వ, ప్రవేట్ రంగాల్లో జరుగుతున్న

అవినీతి వంటి అంశాలపై ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. మరి ఇన్ని హాట్ టాపిక్స్ ఉన్నప్పటికీ వినోదం మిస్ కాకుండా చేసుకున్నట్టు సమాచారం. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని మొదటి పాట రేపు ఉదయం 10 గంటలకు విడుదలకానుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలను వినేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న సినిమా రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus