అప్పుడే అక్కడ బ్రేక్ ఈవెన్ సాధించేసిన ‘భీష్మ’..!

మూడు డిజాస్టర్ల తర్వాత నితిన్ నుండీ వచ్చిన చిత్రం ‘భీష్మ’. సాధారణంగా 3 డిజాస్టర్ లు పడ్డాక స్టార్ హీరోలు సైతం కోలుకోవడం కష్టం. అలాంటిది నితిన్ వాటిని మరిచిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చి తన సత్తా చాటుకున్నాడు. నితిన్ కు ఇది పెద్ద విశేషం కాదు ఎందుకంటే … గతంలో 12 ప్లాప్ ల తర్వాత కూడా హిట్టు కొట్టాడు. ఓ దశలో నితిన్ పని అయిపొయింది అనుకున్న వారు సైతం నోటి మీద వేసుకున్నారు. ఇక భీష్మ కలెక్షన్ల విషయానికి వద్దాం. ఈ చిత్రాన్ని 22.7 కోట్లకు అమ్మితే మొదటి 3 రోజులకే 80 శాతం రికవరీ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్న బయ్యర్స్ దాదాపు సేఫ్ అయిపోయారు.

ఇక ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్టు లో చేరింది ‘భీష్మ’ చిత్రం. ప్రీమియర్స్ కు 94K డాలర్ల ను వసూల్ చేసిన ఈ చిత్రం… శుక్రవారం నాడు 151K డాలర్లను వసూల్ చేసింది. ఇక శనివారం నాడు ఏకంగా 284K డాలర్లను అలాగే ఆదివారం నాడు 158K డాలర్లను … ఇక సోమవారం నాడు 22K డాలర్లను వసూల్ చేసింది. మొత్తంగా 709K డాలర్లను వసూల్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ పూర్తయ్యింది. అయితే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందట… 1 మిలియన్ వరకూ చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక మొదటి వారం పూర్తయ్యేలోపే తెలుగు రాష్ట్రాల్లో ‘భీష్మ’ బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus