నటికి చేదు అనుభవం.. ఆ వీడియో లీక్ చేసి అల్లరి పాలయ్యేలా చేశారట!

  • June 8, 2023 / 11:00 AM IST

సెలబ్రిటీలు కూడా సున్నితమైన వ్యక్తులే. మహా అయితే వాళ్లకి కొన్ని లగ్జరీలు ఎక్కువగా ఉంటాయేమో కానీ.. వాళ్లకి కూడా మనలాంటి సమస్యలే ఉంటాయి. అంతేకాదు వాళ్లకు చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి. రకరకాల భయాలతో వాళ్ళు.. ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు. భూమిక వశిష్ట్ కూడా అందులో ఒకరు అని చెప్పాలి. ఓ డాన్స్ రియాలిటీ షో ద్వారా ఈమె పాపులర్ అయ్యింది. రియాలిటీ షోల గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది.

ఓ వ్యక్తి ఇన్నర్ ఫీలింగ్స్ ను బయటపెట్టడం అనేది దీని ప్రధాన ఉద్దేశం. ఇదిలా ఉండగా.. ఎంటీవీ రోడీస్ అనే రియాలిటీ షోకి సంబంధించిన కొత్త సీజన్ శనివారం నాడు గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. ఈ షోలో భూమిక వశిష్ట్ స్ప్లిట్స్ విల్లా కంటెస్టెంట్ గా ఏంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఇందులో భాగంగా తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను ఈ షో లో బయటపెట్టనుంది భూమిక వశిష్ట్.

ఆమె మాట్లాడుతూ.. ‘డాన్స్ రియాల్టీ షో తర్వాత నేను సెలబ్రటీలాగానే ఉండిపోవాలి అనుకున్నాను. కానీ సెలబ్రిటీ లైఫ్ అనేది డబ్బుతో కూడుకున్నది అని .. దాని కోసం కావల్సిన ఫేమ్, గ్లామర్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని.. అందుకని నా లైఫ్ స్టైల్ కోసం అప్పు తీసుకున్నాను. ఆ టైంలో చాలా ఆర్థిక ఇబ్బందులకి కూడా గురయ్యాను.

ఆ టైంలో అప్పు తీర్చేందుకు దుస్తులు విప్పుతున్న వీడియో ఒకటి ఓ యాప్ లో అప్లోడ్ చేశాను. సీక్రెట్ గా ఉండాల్సిన ఆ వీడియోని ఎవరో లీక్ చేశారు. అది బయటకు ఎలా వెళ్లిందా అని షాక్ కు గురయ్యాను. దాని వల్ల నేను విమర్శల పాలయ్యాను. ఒక్కసారిగా నేను డిప్రెషన్ కు గురయ్యాను. భూమిక మాటలు విని అక్కడున్న గ్యాంగ్ లీడర్స్ రియా చక్రవర్తి, ప్రిన్స్ నరూలా ఆమెను హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus