Samrat Prithviraj: బాలీవుడ్ కి మరో చేదు అనుభవం!

  • June 7, 2022 / 12:22 PM IST

బాలీవుడ్ లో ‘పృథ్వీరాజ్’ అనే మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో నటించారు. మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇందులో సంజయ్ దత్, సోనూ సూద్ లాంటి తారలు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రచార చిత్రాలు చూసి ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’ లాంటి చారిత్రక సినిమాల మాదిరి పెద్ద హిట్ అవుతుందేమో అనుకున్నారు.

కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఒకప్పుడైతే ఈ సినిమా బాగా ఆడేదేమో కానీ.. బాలీవుడ్ సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ.. ప్రేక్షకుల తిరస్కారానికి గురవుతున్న సమయంలో ఈ సినిమా రిలీజ్ కావడం ప్రతికూలంగా మారింది. నిజానికి ఈ సినిమాకి సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. రిలీజ్ తరువాత కూడా పాజిటివ్ టాక్ రాలేదు. తొలి రోజు రూ.10.5 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు సాధించింది.

మామూలుగా చూస్తే ఇవి డీసెంట్ కలెక్షన్స్ అనే చెప్పుకోవాలి. కానీ అక్షయ్ కుమార్ లాంటి హీరో నటించిన ఇంత భారీ సినిమాకు ఈ వసూళ్లు సరిపోవు. దీనిపై నిర్మాతలు భారీ పెట్టుబడులు పెట్టారు. వంద కోట్లకు పైగా నెట్ వసూళ్లు వస్తే తప్ప ఇది బ్రేక్ ఈవెన్ అవ్వదు. కానీ వీకెండ్లోనే అంతంతమాత్రంగా ఉన్న వసూళ్లు.. తర్వాత పుంజుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. సోమవారం నుంచి వసూళ్లు డ్రాప్ అయినట్లుగా ఉన్నాయి.

ఓవరాల్ గా ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యేలా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తోన్న సినిమాలను అక్కడి ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తుండడంతో ఇండస్ట్రీ జనాల్లో టెన్షన్ మొదలైంది. మరేం జరుగుతుందో చూడాలి!

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus