‘ఆచార్య’ కు.. ఈ కష్టాలేంటి…?

ఏ ముహూర్తాన మెగాస్టార్ 152 వ చిత్రాన్ని మొదలు పెట్టారో కానీ… మొదలైనప్పటి నుండీ ఈ చిత్రానికి ఏదో ఓక ఆటంకం వాటిల్లుతూనే. మొదటగా ఈ ప్రాజెక్ట్ కి దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా తీసుకోవాలి అనుకున్నాడు దర్శకుడు కొరటాల. నిజానికి కొరటాల అన్ని సినిమాలకి దేవి నే సంగీతం అందించాడు. కానీ ఎందుకో అతన్ని పక్కన పెట్టి మణిశర్మ ను తీసుకున్నాడు. ఇక ఈ చిత్రంలో కీలక పాత్ర చెయ్యాల్సిన తరుణంలో… ‘ఆర్. ఆర్.ఆర్’ షూటింగ్ వల్ల అతనికి రాజమౌళి పర్మిషన్ ఇవ్వలేదు.

ఆ టైములో మహేష్ ను తీసుకోవాలి అనుకున్నారు. కానీ మహేష్ 30 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతున్నాడు అనే వంకతో పక్కన పెట్టి మళ్ళీ చరణ్ నే తీసుకున్నారు. విచిత్రం ఏమిటి అంటే చరణ్ కూడా 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. సరే ఏదైనా వాళ్ళ జేబులోకే కదా వెళ్ళేది. ఇక ఈ మధ్యనే… త్రిష ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంటున్నట్టు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఆమె తప్పుకుంటున్నట్టు కూడా తెలిపింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో టెక్నీషియన్ కూడా తప్పుకోనున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే… ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నాడట. అయితే మనస్పర్ధల వల్ల కాదులెండి. ఈయనకి వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. ఇక షూటింగ్ కూడా లేటవుతుంది కాబట్టి.. తప్పుకోక తప్పడం లేదని తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ప్లేస్ లో నవీన్ నూలి ని తీసుకున్నట్టు సమాచారం.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus