ఈ కంటెస్టెంట్లకే పెద్ద మొత్తంలో ఇస్తున్నారట..!

ఎట్టకేలకు ‘బిగ్ బాస్ 3’ మొదలైంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో 15 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు.100 రోజుల పాటు ప్రసారమయ్యే ఈ షో లో అప్పుడే సందడి మొదలైపోయారు. ‘బిగ్ బాస్2’ సీజన్లో ముగ్గురు ‘కామన్ మ్యాన్’ ఎంట్రీస్ జరిగాయి… అందులోనూ ఆ షో లో కంటెస్టెంట్స్ అందరూ చిన్న చిన్న సెలబ్రిటీలే. కానీ ఈసారి మాత్రం మంచి పాపులర్ సెలెబ్రిటీలనే తీసుకున్నారు. ఇక ఈ సీజన్‌లో ఎవరికి ఎంత ఇచ్చారనే విషయం మాత్రం చర్చ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది.

‘బిగ్‌బాస్ 2’ లో సింగర్ గీతా మాధురికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒక్క రోజుకి లక్ష రూపాయల వరకూ ఆమె తీసుకుందట. ఇక ఈ మూడవ సీజన్లో ‘పటాస్’ శ్రీముఖి, ‘తీన్మార్’ సావిత్రి, రాహుల్‌కు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారంట. ఈ ముగ్గురికీ యూత్‌లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి రోజుకి ఒక్కొక్కరికీ లక్షన్నర నుండీ 2 లక్షల వరకూ ఇస్తున్నారట. ఇక ఈ ముగ్గురూ గనుక ఎలిమినేట్ అవ్వకుండా ఎక్కువ రోజులు హౌస్ లో ఉండగలిగితే మరింత పెద్ద మొత్తంలో అందుకునే అవకాశం ఉంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus