శ్రీముఖి విన్నర్ అట.. వైరల్ అవుతోన్న ఫోటో..!

  • November 1, 2019 / 06:15 PM IST

‘బిగ్ బాస్ సీజన్-3’ తుది దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇప్పుడు హౌస్ లో రాహుల్, వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా ఉన్నారు. వీరిలో ఎవరు విన్నర్ అవుతారా అనే ఉత్కంఠత… అంతకంతకు పెరుగుతుంది. హౌస్ లో ఉన్న ఈ ‘టాప్ 5’ కంటెస్టెంట్ లకు… వారి అభిమానులు గట్టి ప్రచారమే చేస్తున్నారు. ఇక ‘బిగ్ బాస్2’ కి విన్నర్ ఎవరనే విషయంలో ముందే ఓ క్లారిటీ వచ్చేసింది. ఓ విధంగా గేమ్ ‘ఒన్ సైడ్’ అయిపొయింది అని చెప్పుకోవచ్చు. కానీ ‘సీజన్ 3’ విషయంలో అలా కాదు. ఇప్పుడున్న హౌస్ మేట్స్ అందరికీ క్రేజ్ బాగా ఉంది.

కానీ సోషల్ మీడియాలో శ్రీముఖి విన్నర్ అయ్యి ‘బిగ్ బాస్ టైటిల్’ గెలుచుకున్నట్టు ఓ ఫోటో వైరల్ అవుతుంది. దీంతో శ్రీముఖి విన్నర్ ఏంటి.. ఇంకా వోటింగ్ లైన్స్ పూర్తవ్వలేదు కదా అనే డౌట్… అందరికీ ఏర్పడింది. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు… అది ఫేక్ ఫోటో అని తేలిపోయింది. సల్మాన్ ఖాన్ హిందీ ‘బిగ్ బాస్’ కు సంబందించిన ఫోటో ఇదని తెలుస్తుంది. కొంచెం ఎడిటింగ్ చేసి నాగార్జున, శ్రీముఖి మొహాలు తగిలించారు అంతే..! ఇంకా ఫైనల్ ఎపిసోడ్ కు సంబందించిన షూటింగ్ కూడా మొదలు కాలేదట. ఇక ఈ విషయం తెలిసాక కొంతమంది నెటిజన్లు ‘ఈ అమీర్ పేట్’ ఎడిటింగ్ లు ఆపండి’ అంటూ శ్రీముఖి విన్నర్ ఫోటో పై కామెంట్లు చేస్తున్నారు.


మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus