బిగ్ బాస్ 4: ఎలిమినేషన్ గండం ఎవరికి..?

  • November 29, 2020 / 12:40 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఇంకా రెండువారాలు మాత్రమే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఇంకా మిగిలిన ఐదుగురు సభ్యులు ఫినాలే రేస్ లో తలబడతారు. ఆ వీక్ గ్రాండ్ ఫినాలేలో ఓట్లు ఎవరికి ఎక్కువగా వస్తే వాళ్లే విన్నర్ అవుతారు. అయితే, ఇప్పుడు ఫైనల్స్ లో తలబడే ఆ ఐదుగురు ఎవరు అనేది చాలా ఉత్కంఠగా మారింది.

లాస్ట్ సీజన్ లో ఐపియల్ లో ప్లే ఆఫ్ కి నాలుగు టీమ్స్ ఎలాగైతే కొట్టుకున్నాయో ఇప్పుడు కూడా ఫైనల్స్ కి వెళ్తేందుకు హౌస్ మేట్స్ మధ్యలో రసవత్తరమైన పోటీ ఉండబోతోంది. ఇప్పుడు ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ప్రమాదంలోకి వచ్చేశారు. ఈ రెండు వారాలు కెప్టెన్ లేరు కాబట్టి నామినేషన్ ప్రక్రియ అనేది టాస్క్ రూపంలో పెడతాడు బిగ్ బాస్. ఇందులో ఎవరు నామినేట్ అవుతారు. ఎవరు సేఫ్ అవుతారు అనేది చాలా ఆసక్తికరం.

ప్రస్తుతం నలుగురు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఫైనల్స్ కి వెళ్లేలాగానే కనిపిస్తున్నారు. వారిలో అఖిల్, అభిజిత్, హారిక, ఇంకా సోహైల్ లు ఉన్నారు. ఇక మిగిలింది ముగ్గురే ముగ్గురు. అరియానా, మోనాల్, అవినాష్. ఒకవేళ ఈవారం రేస్ టు ఫినాలే అని చెప్పి టాస్క్ పెట్టి ఫినాలే టిక్కెట్ ఎవరికైనా వస్తే ఆ కథ అనేది పూర్తిగా మారిపోతుంది. అప్పుడు టిక్కెట్ వచ్చినవాళ్లు డైరెక్ట్ గా టాప్ 5 లోకి వెళ్లిపోతారు.

అయితే, ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ 13వ వారం , 14వ వారం రెండుసార్లు ఎలిమినేషన్ ప్రక్రియని ఇంకా చేయాల్సి ఉంది. సో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఖచ్చితంగా వెళ్లిపోతారు. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం చూస్తే గతవారాలనుంచి చూస్తున్న పార్టిసిపెంట్ ఓటింగ్ ని యావరేజ్ చేస్తే, అవినాష్ కి, అరియానాకి, అలాగే మోనాల్ కి , అఖిల్ కి ఈ గండం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక మిగిలింది రెండు వారాలే కాబట్టి ఎవరైనా నామినేషన్స్ లోకి రావచ్చు. ఇక్కడ టాప్ లో ఖచ్చితంగా వెళ్లే నలుగురిలో ఎవరైనా నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నామినేషన్స్ లోకి ఒకవేళ వచ్చినా అరియానా, మోనాల్, అవినాష్ లు ఉంటే వీళ్లు సేఫ్ జోన్ లోకి వెళ్తారు. లేదా ఈ నలుగురు మాత్రమే నామినేషన్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకరికి ఎలిమినేషన్ గండం ఉంటుంది. నో డౌట్.

లాస్ట్ టైమ్ ఐపియల్ మ్యాచ్ లో సేమ్ పాయింట్స్ ఉన్నా కూడా పక్క టీమ్స్ గెలుపు పైన టీమ్స్ అన్నీ కూడా ఆదారపడినట్లుగా ఇప్పుడు కూడా ఈ నలుగురు హౌస్ మేట్స్ ఈ ముగ్గురు హౌస్ మేట్స్ పై ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. లేదంటే ఎంతటి స్ట్రాంగ్ ప్లేయర్ అయినా ఎలిమినేట్ అవ్వక తప్పదు.

అలాకాకుండా ఉదాహరణకి.. 13వ వారం నామినేషన్స్ లో సోహైల్, అకిల్, అభిజిత్ ముగ్గురే ఉన్నారనుకోండి. అప్పుడు ఎవరైనా వెళ్లిపోవచ్చు. ఒకవేళ సోహైల్, హారిక, అభిజిత్ ముగ్గురే ఉన్నారనుకోండి.. అప్పుడు ఇంకా టఫ్ ఫైట్ అయిపోతుంది. అందుకే, ఇప్పుడు ఈరెండు వారాలు హౌస్ మేట్స్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదీ మేటర్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus