Bigg Boss 5 Telugu: ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూసే..!

అవును ‘బిగ్ బాస్5’ కి డేట్ ఫిక్స్ అయ్యింది. అలాగే హోస్ట్ కూడా ఫిక్స్ అయ్యారు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల గతేడాది లానే ఈసారి కూడా ‘బిగ్ బాస్’ ఆలస్యంగానే ప్రారంభం కాబోతుంది. కంటెస్టెంట్ లు కూడా రెడీ అయ్యారు. ఆ లిస్ట్ ను ప్రస్తుతానికైతే ‘బిగ్ బాస్’ టీం సీక్రెట్ గా ఉంచుతుంది. నెట్ లో మాత్రం కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. అవి ఎంతవరకు నిజం అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రీమియర్ అయ్యే వరకు స్టార్ మా వారు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక హోస్ట్ గా ఈసారి కూడా నాగార్జున ఫైనల్ అయ్యారట. ‘బిగ్ బాస్3’ ‘బిగ్ బాస్4’ లను ఆయన హోస్ట్ చేసి అదిరిపోయే టి.ఆర్.పి రేటింగ్ నమోదవ్వడంలో కీలక పాత్ర పోషించారు. దాంతో సీజన్ 5 ను కూడా ఆయనతోనే హోస్ట్ చేయించాలని డిసైడ్ అయ్యారట ‘బిగ్ బాస్’ నిర్వాహకులు. నిజానికి ఈ సీజన్ ను హోస్ట్ చేయడానికి ముందుగా నాగ్ ఇంట్రెస్ట్ చూపించలేదు.దాంతో బిగ్ బాస్ నిర్వాహకులు మరికొంతమంది హీరోలను సంప్రదించారు.

నాని అలాగే రానా వంటి హీరోలను వారు సంప్రదించారు. కానీ ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో మళ్ళీ నాగార్జుననే కన్వెన్స్ చేసి ఒప్పించారట. సెప్టెంబర్ 5 నుండీ ‘బిగ్ బాస్5’ ప్రారంభం కానుంది. ‘బంగార్రాజు’ షూటింగ్ లో పాల్గొంటూనే వీకెండ్స్ లో నాగార్జున ‘బిగ్ బాస్5’ షూటింగ్ కు హాజరవుతారట నాగ్.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus