బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీలకి పెట్టింది పేరు. తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి హౌస్ మేట్స్ అందరూ ఒకే దగ్గర చేరి మరీ ప్రేక్షకులకి ఆ మాజాని అందిస్తుంటారు. ఇందులో భాగంగా వారు పడిన కష్టాలు, వాళ్లు అనుభవించిన బాధలని ఆడియన్స్ తో షేర్ చేస్కుంటారు. అయితే, ప్రతి సీజన్ లో కూడా బిగ్ బాస్ షోలో ఏదో ఒక లవ్ స్టోరీ అనేది ఆడియన్స్ చూడాల్సి వస్తోంది. ఇప్పుడు ఇదే విషయాన్ని బిగ్ బాస్ లవర్స్ అందరూ ఈ లవ్ స్టోరీస్ ఏంట్రా బాబు అంటూ షేర్ చేస్తున్నారు.
సీజన్ 1 నుంచీ బిగ్ బాస్ ఇచ్చిన బిల్డప్స్ ని, హౌస్ లో జరిగిన ప్రేమాయణాలని ట్రోల్ చేస్తున్నారు. మొదటి సీజన్ లో ప్రిన్స్ అండ్ ధీక్షాల మద్యన కాస్త కమెస్ట్రీ చూసాం. లవ్ ట్రాక్ అని చెప్పలేం కానీ, ప్రిన్స్ అడిగాడని చెప్పి దీక్ష వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక సీజన్ – 2లో చూస్తే మనకి తేజస్విని సామ్రాట్ ల లవ్ స్టోరీ డైరెక్ట్ గానే నడిచింది. వీరిద్దరి మద్యలో కెమిస్ట్రీ అనేది బాగా వర్కౌట్ అయ్యింది. ఇక సీజన్ – 3 లో లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. రాహుల్ సిప్లిగంజ్ ఇంకా పునర్నవిల పైన జోక్స్ పేలుతూనే వచ్చాయి. సోషల్ మీడియాలో దుమారాన్నేలేపాయి. సీజన్ – 4 లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మోనాల్ అండ్ అఖిల్ వీరిద్దరి మద్యన చాలా వారాలు ట్రాక్ నడిపించాడు బిగ్ బాస్.
ఇప్పుడు సీజన్ – 5లో మనం ఎలాంటి లవ్ స్టోరీస్ చూడబోతున్నామో హింట్స్ ఇచ్చేస్తున్నాడు. శ్రీరామ్ చంద్ర ఇంకా హమీదలు మనోహరా సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ వీరలెవల్లో రొమాన్స్ ని పండించారు. ఇక రెండో వారం నుంచే బిగ్ బాస్ ఆల్రెడీ ఈ ట్రాక్ కి హింట్స్ ఇస్తునే ఉన్నాడు. మరో జంట లహరి అండ్ మానస్, ఇంకా ప్రియాంక సింగ్ అండ్ శ్రీరామ్ చంద్ర లేదా శ్రీరామ్ అండ్ హమీద ట్రాక్ నడుస్తోంది. ఇక క్యూట్ గా ఉమాదేవి లోబోల ట్రాక్ కూడా ఓపెన్ అయ్యింది. ఈ మూడు లవ్ స్టోరీస్ లో ఈసీజన్ లో ఏది హైలెట్ అవుతుందనేది ఆసక్తికరం. అదీ మేటర్.