Inaya Sultana: హాట్ టాపిక్ గా మారిన ఇనయ సుల్తానా పాత ఫోటో..!

  • December 15, 2022 / 11:34 AM IST

మిలియన్ డాలర్ల ప్రశ్న..! రెండు రోజులుగా నెటిజన్లను అయోమయానికి గురి చేసిన ప్రశ్న. బిగ్ బాస్ 6.. కంటెస్టెంట్.. ఇనయ సుల్తానా కి పెళ్ళైందా? సడెన్ గా ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటే.. ఓ పాత ఫోటో వల్ల. ఇనయకి.. సంబంధించిన ఓ త్రో బ్యాక్ పిక్ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఇనయకి పెళ్ళయ్యినట్టు కనిపిస్తుంది. దీంతో ఇనయ సుల్తానాకి పెళ్లైనట్టు ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ విషయం పై చర్చించుకుంటూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు పెళ్ళైనా కూడా అవకాశాలు రావేమో అని భయపడి ఆ విషయాన్ని దాచి పెడతారు.

గతంలో చాలా మంది భామలు ఇలాగే చేశారు. అందుకే ఇనయ కూడా ఇలా చేసిందేమో అని అందరి అభిప్రాయం. అదేమో కానీ ప్రస్తుతం ఆమె తన బిగ్ బాస్ ప్రియుడు ఆర్జె సూర్యతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. బిగ్ బాస్ లో సూర్య – ఇనయ ల రొమాన్స్ హైలెట్ గా నిలిచేది.

సూర్య అంటే ఇష్టం అని ఇనయ ఓపెన్ గానే చెప్పేసింది. వీళ్ళ గేమ్ డిస్టర్బ్ అయ్యింది అందుకే అంటూ కొంతమంది కామెంట్లు చేసినా.. అది బిగ్ బాస్ స్కెచ్ ఏమో అని మరికొందరు అభిప్రాయ పడ్డారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus