Priyanka Jain: హాట్ టాపిక్ గా మారిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ పాత వీడియో..!

‘బిగ్ బాస్ 7’ సెప్టెంబర్ 3న ఘనంగా ప్రారంభమైంది. ఈ సీజన్లో 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే రంగంలోకి దిగారు. ఫేడౌట్ అయిపోయిన సెలబ్రిటీలతో పాటు ఇప్పుడిప్పుడే ఫేమ్ లోకి రావాలని పరితపించే బ్యాచ్ రంగంలోకి దిగారు అని చెప్పాలి. ఈసారి బిగ్ బాస్ పై జనాల్లో అంతగా ఆసక్తి లేదు. సీజన్ 5 వరకు జనాల్లో బిగ్ బాస్ పై ఓ రేంజ్లో ఆసక్తి ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఈ సీజన్లో కూడా జనాలకి తెలిసిన కంటెస్టెంట్లు చాలా అంటే చాలా తక్కువ.

ఆ తెలిసిన వారిలో ప్రియాంక జైన్ ఒకరు. ఆమె ‘మౌనరాగం’ ‘జానకి కలగనలేదు’ వంటి సీరియల్స్ తో బాగా పాపులర్ అయ్యింది. అంతకు ముందు ఆమె సినిమాల్లో కూడా నటించింది అనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. కన్నడలో ‘గోలీసోడా’, తమిళంలో ”రంగి తరంగ’ , తెలుగులో ‘చల్తే చల్తే’ ‘వినరా సోదర వీర కుమార’ వంటి సినిమాల్లో నటించింది. ‘జానకి కలగనలేదు’ సీరియల్లో ఈమె చీరకట్టులో చాలా పద్దతిగా కనిపించింది.

అయితే ఈమె (Priyanka Jain) ఒరిజినల్ వేరు. ‘వినరా సోదర వీర కుమార’ అనే సినిమాలో ఈమె ఓ బెడ్ రూమ్ సీన్లో కూడా ఓ రేంజ్లో బోల్డ్ గా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారు ‘ఏంటి ప్రియాంక జైన్ ఇలాంటి సన్నివేశంలో కూడా నటించిందా?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus