Bigg Boss 5 Telugu: ప్రోమోలో హైలెట్.. ఎపిసోడ్ లో నిల్..!

  • September 21, 2021 / 11:31 AM IST

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ విశ్వ షణ్ముక్ పడుకున్నందుకు పనిష్మెంట్ ఇచ్చాడు. ఇది ప్రోమోలో చాలా హైలెట్ చేసింది బిగ్ బాస్ టీమ్. షణ్ముక్ పడుకుంటే కుక్కలు అరుస్తాయి. వెంటనే లేచిన షణ్ముక్ తో విశ్వ స్మిమ్మింగ్ పూల్ లో 21సార్లు దిగి మళ్లీ లేచి రమ్మని పనిష్మెంట్ ఇస్తాడు. దీంతో షణ్ముక్ చాలా దిగాలుగా స్మిమ్మింగ్ పూల్ లో దూకుతాడు. అక్కడే ప్రియ మరీ మిలట్రీ మాన్ లాగా అయ్యాడు విశ్వ అంటుంది. పక్కనే ఉన్న శ్వేత అయితే 21సార్లు అంటే చాలా టూమచ్ అని చెప్తుంది. దీన్ని ప్రోమోలో బాగా హైలెట్ చేశారు.

ఒకవైపు షణ్ముక్ ఫ్యాన్స్ అందరూ ఈ ఎపిసోడ్ షణ్ముక్ కి బాగా ఫేవర్ అయిపోతుందని, సోషల్ మీడియాలో తెగ హడావుడి చేసేయాలని చూశారు. కానీ, ఎపిసోడ్ లో చూస్తే ఈ సీన్ దీపావళికి పేలని బాంబ్ లాగా తుస్సుమంది.షణ్ముక్ అండ్ శ్వేత ఇద్దరూ చేసిన ఫన్ హైలెట్ అయ్యింది. అలాగే, ప్రియ అండ్ లహరి లమద్యన వార్ , రవి అండ్ ప్రియా మద్యలో సన్నీ అండ్ ప్రియా మద్యలో ఆర్గ్యుూమెంట్స్ తో హౌస్ హీటెక్కిపోయింది. నామినేషన్స్ లో లహరి ఈసారి హైలెట్ అయ్యింది.

లాస్ట్ టైమ్ హమీద అండ్ శ్వేత వర్మలు హైలెట్ అయితే, ఈసారి లహరి అండ్ ప్రియలు ఇద్దరూ హైలెట్ అయ్యారు. నిజానికి ప్రోమోలో వచ్చిన సీన్స్ ఎపిసోడ్స్ లో అప్పుడప్పుడు తేలిపోతుంటాయి. ఇప్పుడు షణ్ముక్ విషయంలో కూడా అదే జరిగింది. షణ్ముక్ సిమ్మింగ్ పూల్ లో దూసుకుతుంటే మిగతా హౌస్ మేట్స్ అందరూ కామెడీ చేశారు. సీరియస్ సీన్ కాస్త కామెడీ సీన్ లాగా మారిపోయింది. ఏది ఏమైనా షణ్ముక్ ఫ్యాన్స్ హడావుడి చేయాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే. ఇక నామినేషన్స్ లో చూసినట్లయితే శ్రీరామ్ చంద్రని కి ఎక్కువ ఓట్లు రావడం విశేషం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus