ఎన్టీఆర్ కంటే ఎక్కువగా నాని తీసుకుంటున్నారా ?

“బాబాయ్ ఈసారి ఇంకొంచెం మసాలా.. ఏదైనా జరగొచ్చు” అనే డైలాగ్ తో నాని బిగ్ బాస్ సీజన్ 2 (తెలుగు) కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్టు స్పష్టంచేశారు. ఈ డైలాగ్ తోనే మొదటి సీజన్ కంటే ఈ సీజన్ మరింత హాట్ గా ఉండబోతుందని అర్ధమవుతోంది. అంతేకాకుండా ఈసారి వందరోజులపాటు కంటెస్టెంట్ హౌస్ లో ఉండాల్సి వస్తుంది. అలాగే నిబంధనలు కూడా చాలా మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ షో కి నాని ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేదానిపైనా.. ఫిలిం నగర్లో జోరుగా చర్చ జరుగుతోంది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ ఏడు కోట్లు వరకు తీసుకున్నారని టాక్.

ఇప్పుడు షో పొడిగించారు కదా.. నాని కూడా రెమ్యునరేషన్ పెంచారా? అని సందేహాలు మొదలయ్యాయి. అయితే ఎన్టీఆర్, నాని మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎన్టీఆర్ సినిమా వందకోట్ల కలక్షన్స్ దాటుతుంది. నాని చిత్రం 50 కోట్లు వసూలు చేస్తే గొప్ప. అందుకే సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్లో చాలా తేడా ఉంటుంది. అదే విధంగా ఈ రియాలిటీ షోకి నాని నాలుగు కోట్లు అందుకోబోతున్నట్లు తెలిసింది. ఇక ఈ షోలో హీరో తరుణ్, క్రేజీ సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్యామలా, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి, గజాలా, తేజశ్వి తదితరులు పాల్గొనబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే నెల నుంచి మొదలయ్యే ఈ సీజన్ లో సామాన్యులు కూడా పాల్గొనున్నారు. ఈ షో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus