బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సోహైల్ ప్రస్తుతం పలు సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. బిగ్ బాస్ సీజన్ ఫోర్ ద్వారా టాప్ త్రీ కంటెస్టెంట్ గా 25 లక్షల రూపాయల డబ్బు తీసుకొని బయటకు వచ్చిన సోహైల్ సినిమాలతో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఈయన నటించిన లక్కీ లక్ష్మణ్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సోహైల్ మాట్లాడుతూ తన గురించి తన ఫ్యామిలీ గురించి ట్రోల్ చేసిన వారికి తనదైన స్టైల్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఇతను మాట్లాడుతూ తాను బిగ్ బాస్ కార్యక్రమంలో మోసం చేసి 25 లక్షల రూపాయలు తీసుకున్నానని చాలామంది తనతో పాటు తన ఫ్యామిలీని కూడా ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో నేను అలా డబ్బు తీసుకోవడానికి ఓ కారణం ఉంది.
నేను ఎవరిని మోసం చేసి తీసుకోలేదు అప్పుడు డబ్బు నాకు అవసరం అందుకే ఆ డబ్బు తీసుకున్నానని తెలిపారు.ఆ డబ్బుతో నా చెల్లెలు పెళ్లి చేశాను ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అన్నయ్యకు చెల్లెలు పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు అందుకే ఆ డబ్బుతో తన చెల్లి పెళ్లి చేశానని సోహైల్ తెలిపారు.
ఇలా తాను డబ్బు తీసుకున్నందుకు తనని మాత్రమే కాకుండా తన ఫ్యామిలీని కూడా ట్రోల్ చేశారని ఇది మంచి పద్ధతి కాదనీ, ఇకపై ఎవరూ కూడా తన ఫ్యామిలీని ట్రోల్ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు. అలా కాదని ఎవరైనా ట్రోల్ చేస్తే వెతికి మరి కొడతా అంటూ ఈ సందర్భంగా ట్రోలర్స్ కు ఈయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఈ కార్యక్రమంలో భాగంగా సోహైల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.