ఖిలాడి, రామారావు చిత్రాలతో డిజాస్టర్లు చవిచూసిన రవితేజ 2022లో ముచ్చటగా మూడో సినిమా “ధమాకా”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (డిసెంబర్ 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ & రవితేజ ఫ్యాన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: పీపుల్ మార్ట్ అధినేత వారసుడు ఆనంద్ చక్రవర్తి (రవితేజ), ఓ సాధారణ మిడిల్ క్లాస్ యువకుడు స్వామి (రవితేజ). పీపుల్ మార్ట్ కంపెనీని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు కార్పొరేట్ కింగ్ జె.పి (జయరాం). ఆ టేకోవర్ నుంచి కంపెనీని కాపాడడం కోసం ఆనంద్ చక్రవర్తి & స్వామి కలిసి చేసిన రచ్చే “ధమాకా” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు: రవితేజ మళ్ళీ తన ఫేవరెట్ జోనర్ లోకి వచ్చేశాడు. ఫుల్ ఎనర్జీతో తన అభిమానులను విశేషంగా అలరించాడు. కానీ.. రెండు క్యారెక్టర్స్ యొక్క వ్యవహారశైలి & బ్యాక్ స్టోరీకి పెద్ద ఎలివేషన్ లేకపోవడంతో.. రవితేజ ఎనర్జీ వేస్ట్ అయ్యిందనే చెప్పాలి. శ్రీలీల అందంగా నటించింది కానీ.. రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోయింది.
ముఖ్యంగా మాస్ సీన్స్ లో ఆమె పెర్ఫార్మ్ చేయలేకపోయింది. అందువల్ల నటిగా ఎలివేట్ అవ్వలేకపోయింది. జయరాం క్యారెక్టర్ “అల వైకుంఠమురలో” చిత్రాన్ని తలపిస్తుంది. మిగతా పాత్రధారుల పరిస్థితి కూడా ఇంతే.
సాంకేతికవర్గం పనితీరు: భీమ్స్ సినిమాటోగ్రఫీ & కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ మాత్రమే సినిమా మొత్తానికి పాజిటివ్ పాయింట్స్. భీమ్స్ తనదైన శైలి పాటలు, నేపధ్య సంగీతంతో అలరించడానికి తనవంతు ప్రయత్నం చేయగా.. కార్తీక్ ఘట్టమనేని తక్కువ బడ్జెట్ తో హైలెవల్ అవుట్ పుట్ ఇచ్చాడు. ఫ్రేమింగ్స్ కూడా బాగున్నాయి. సినిమా రొటీన్ గా ఉన్నప్పటికీ.. కార్తీక్ ఘట్టమనేని వర్క్ కాస్త ఊరటనిచ్చింది.
రచయిత ప్రసన్న కుమార్ కథ, త్రినాధరావు నక్కిన కథనం, దర్శకత్వం సినిమాకి మెయిన్ మైనస్ గా నిలిచాయి. ఈ తరహా కథను ఇప్పటికీ ఒక 50 సార్లు చూసి ఉంటాం. కనీసం మేకింగ్ విషయంలోనైనా కొత్తదనం కోసం ప్రయత్నించి ఉంటే కనీసం ఎంటర్టైన్మెంట్ అయినా ఎంజాయ్ చేసేవారు ఆడియన్స్. కానీ.. ప్రసన్నకుమార్ & త్రినాధరావు కలిసి ఆ ఛాన్స్ లేకుండా చేశారు.
విశ్లేషణ: 2022లో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న రవితేజ కల నెరవేరలేదనే చెప్పాలి. “ధమాకా” మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు.. రవితేజ్ వీరాభిమానులు కూడా పూర్తిస్థాయిలో ఆస్వాదించలేరు. రవితేజ ఇకనైనా ఈ అవుట్ డేటెడ్ కథలు, బాడీ లాంగ్వేజ్ కొత్తగా చూపలేని క్యారెక్టర్లు పక్కన పెట్టాలి. లేదంటే.. ఆయన అభిమానులకు ఎప్పటికప్పుడు నిరాశే మిగులుతుంది.
రేటింగ్: 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus