Pallavi Prashanth: కొత్త లుక్ తో షాకిచ్చిన పల్లవి ప్రశాంత్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

  • July 16, 2024 / 09:49 PM IST

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో విషయంలో కొన్ని విమర్శలు వినిపించినా ఈ షో నచ్చేవాళ్లు, ఈ షోను అభిమానించే వాళ్లు ఎక్కువమంది ఉన్నారు. బిగ్ బాస్ షో సీజన్7 విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) నిలిచారు. అయితే బిగ్ బాస్ షో తర్వాత పల్లవి ప్రశాంత్ ఎక్కువగా టీవీ షోలలో కానీ సోషల్ మీడియాలో కానీ హడావిడి చేయలేదు. బిగ్ బాస్ తర్వాత ఒక కేసులో చిక్కుకోవడం పల్లవి ప్రశాంత్ ను ఎంతగానో ఇబ్బంది పెట్టింది.

అయితే పల్లవి ప్రశాంత్ లుక్ మార్చేసి కొత్త లుక్ లో కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కొత్త లుక్ లో పల్లవి ప్రశాంత్ బాగున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తుండగా మరి కొందరు బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన ఫ్రైజ్ మనీ మొత్తాన్ని పల్లవి ప్రశాంత్ రైతులకు ఇస్తానని చెప్పాడని అందుకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ఈ కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

బిగ్ బాస్ కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు పుట్టినరోజు వేడుకల్లో పల్లవి ప్రశాంత్ పాల్గొనగా అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ కావడం జరిగింది. అల్ట్రా మోడ్రన్ లుక్ లో పల్లవి ప్రశాంత్ ఆశ్చర్యపరిచాడని మరి కొందరు చెబుతున్నారు. షాప్ ఓపెనింగ్స్ కు గెస్ట్ గా కూడా పల్లవి ప్రశాంత్ హాజరవుతున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ షో క్రేజ్ పల్లవి ప్రశాంత్ కు ప్లస్ అయింది.

ఎంతో కష్టపడి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోకు విజేతగా నిలవడం ద్వారా తన లక్ష్యాన్ని సులువుగానే సాధించారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షో క్రేజ్ ను సరిగ్గా వినియోగించుకుంటే పల్లవి ప్రశాంత్ కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus